WhatsApp encrypts messages for all its users

Whatsapp announces full encryption on all platforms

whatsapp, whatsapp encryption, whatsapp end-to-end encryption, whatsapp chat security, whatsapp new feature, whatsapp update, end-to-end encryption in whatsapp, whatsapp vs telegram, whatsapp security, technology, technology news

WhatsApp is now end-to-end encrypted by default and at all times. Here's what the end-to-end encryption means and how it will work.

Whatsapp 100% సేఫ్.. ప్రైవసీ రక్షణకు కొత్త ఎన్‌క్రిప్షన్‌ కోడ్‌

Posted: 04/06/2016 01:21 PM IST
Whatsapp announces full encryption on all platforms

‘‘మీ రహస్యాలకు 100 శాతం భద్రత కల్పిస్తున్నాం. మీరు ఇచ్చే సందేశాలను చూసే అవకాశం మీరు కోరుకున్నవాళ్ళకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు’’ అని వాట్సాప్ తమ కస్టమర్లకు నూటికి నూరు శాతం గ్యారెంటీని ఇస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా యూజర్ల నమ్మకాన్ని చూరగొన్న వాట్సాప్ తాము కస్టమర్లకు ఇస్తున్న నమ్మకాన్నినిలుపుకునేందుకు తాజగా  మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇక దీని ద్వరా యూజర్లు పంపించే సందేశాలు ఇతరులు ఎవరూ చూడలేరని బలంగా చెబుతుంది

అదెలా అంటే.. నూటికి నూరు శాతం ప్రైవసీని కాపాడటానికి కొత్త ఎన్‌క్రిప్షన్‌ కోడ్‌ను జత చేసింది. ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్ బెర్రీ వంటి అన్ని ప్లాట్‌ఫారాలపైనా ఇది నమ్మకంగా పనిచేస్తుందని చెబుతోంది. యూజర్ల సందేశాలకు కట్టుదిట్టమైన భద్రత లభిస్తుందని వాట్సాప్ భరోసానిస్తోంది. అమెరికా అధికారులు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేరని ధీమాను వ్యక్తం చేస్తుంది, అయితే అదే సమయంలో స్వయంగా తమ కంపెనీ కూడా ఆ గుట్టు విప్పబోదని యూజర్లకు హామినిస్తోంది.

ఎవరి కోసం సందేశాన్ని పంపిస్తే వారు మాత్రమే చూసి, చదవడానికి వీలయ్యేలా తయారు చేసినట్లు వాట్సాప్ సహ వ్యవస్థాపకులు జాన్ కోమ్, బ్రియాన్ ఆక్టన్ మంగళవారం బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. మీరు పంపించే సందేశాలను సైబర్ క్రిమినల్స్, హ్యాకర్లు, రాజ్యాధికారాలు కూడా చూడటం సాధ్యం కాదని పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాలు, అమెరికా అధికారులు కూడా వాట్సాప్ ఇన్‌స్టంట్ మెసేజ్‌లను, వాయిస్ కాల్స్‌ను అడ్డుకొని వాటిలోని వివరాలను తెలుసుకోలేరని తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Whatsapp  top secret  whatsapp encryption  security  technology  

Other Articles