Mum breastfeeds 5-year-old daughter – and has even kicked husband out of bed so she can feed overnight

Miira dawson claims long term breastfeeding has made her five year old smarter

Breast feeding, IQ, Mum-of-two Miira Dawson, Miira Dawson, Poole, Dorset, daughter Tara, health, IQ benefits, mum Miira, wine merchant Jim, Tara fed three times a day, two-year-old, Ray Lee.

Mum-of-two Miira Dawson, of Poole, Dorset, said she would happily breastfeed daughter Tara until she is ten-years-old

అమ్మో.. అమ్మ..! పిల్లలు కోసం భర్తను సుఖం వదులుకోమ్మంది..

Posted: 04/06/2016 01:54 PM IST
Miira dawson claims long term breastfeeding has made her five year old smarter

‘‘తల్లి పాలు బిడ్డకు శ్రేష్ఠం’’ అని ప్రపంచ వ్యాప్త మహిళలు విశ్వసిస్తుంటారు, అయితే అందులో నిజమెంతా అంటే నూటికి నూరుశాతం. ఈ విషయం తెలుసుకున్న ఓ లండన్ తల్లి తన పిల్లలకు పదేళ్ల వరకు చనుబాలు ఇస్తానంటుంది, ఇందుకోసం తన భర్తను కూడా పడక గదిలోకి రానీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది, తన పిల్లల సుఖంగా నిద్రపోవాలంటే.. తాను ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదని తేల్చిచెబుతుంది, వివరాల్లోకి వెళ్లే లండన్ లోని డోర్ సెట్ పట్టణానికి సమీపంలోని పూలేకు చెందిన మీరా డాసన్ తల్లి పాటే బిడ్కు శ్రేష్టమైనవని నమ్ముతుంది.

తన చనుబాలు తాగితే తన పిల్లలు ఆరోగ్యంగా, అత్యంత తెలివివంతులవుతారని కూడా బలంగా నమ్ముతున్నారు. తన ఇద్దరు బిడ్డలకు పదేళ్ళ వయసు వచ్చే వరకు పాలు ఇచ్చి పెంచుతానని ఘంటాపథంగా చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఆ బిడ్డల మేధాశక్తి పెరుగుతుందని, వాళ్ళు చురుగ్గా ఎదుగుతారని ఆమె నమ్ముతున్నారు. మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకత అంటూ భర్తను రాత్రి వేళల్లో కూడా దగ్గరికి చేరనివ్వడం లేదట. చేసేది లేక ఆ భర్త ముఖం వాచి, ఉసూరుమంటున్నాడు.

మీరా డాసన్ కుమార్తె పేరు తార, వయసు ఐదేళ్ళు, కుమారుడి పేరు రే లీ, వయసు రెండేళ్ళు. తార స్కూలుకెళ్తోంది కుమారుడు ఇంటి దగ్గరే ఉంటాడు. వీరిద్దరికీ తాను రోజుకు మూడుసార్లు చనుబాలు ఇస్తానని చెబుతుంది డాసన్, చక్కని ఇల్లాలుగా పేరు తెచ్చుకోవాలని, తన బిడ్డలిద్దరూ గొప్ప విద్యావంతులు కావాలని ఆమె కలలు కంటోంది. అందుకోసం వారికి మేధాసంపత్తి పెరిగేందుకే తాను పదేళ్ల వరకు వారికి పాలిస్తానని చెబుతోంది,

మీరా భర్త పేరు జిమ్. ఆయన వైన్ మర్చంట్. బిడ్డలకు ఈ విధంగా రోజుకు మూడుసార్లు చనుబాలు ఇస్తూండటాన్ని ఆయన వ్యతిరేకించడం లేదు. అయితే తాను నిర్లక్ష్యానికి గురవుతున్నానన్న బాధ కూడా ఆయనకు ఉందట. పిల్లలిద్దర్నీ చెరోవైపు పెట్టుకుని చనుబాలు ఇస్తూ కింగ్ సైజ్ బెడ్ మీద ఆమె పడుకుంటే, తాను వేరే గదిలో పడుకోవాల్సి వస్తోందంటున్నారు. తార అయితే నిద్ర వచ్చే వరకూ పాలు తాగుతూనే ఉంటుందట. పిల్లలకు రసాయనాలు కలిసిన ఆహారాన్ని ఇచ్చే కన్నా చనుబాలు ఇవ్వడమే మంచిదని కూడా జిమ్ చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles