రామేశ్వరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటి అరిచల్‌మునై తీరంలో కడలి ప్రవాహవేగం అధికమవుతుండటంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇసుక దిబ్బలు చిన్న చిన్న దీవుల్లా మారుతున్నాయి. అరిచల్‌మునై సముద్రతీరానికి, శ్రీలంక తీరానికి మధ్యన సముద్రంలో ఇంచుమించు చిన్న చిన్న దీవుల్లా 13 ఇసుక దిబ్బలున్నాయి. ధనుష్కోటి తీరంలోని ఆ ఇసుకదిబ్బలు పగలు మాత్రమే కనిపిస్తాయి. రాత్రిపూట సముద్రపు నీటిలో మునిగిపోతుంటాయి. అరిచల్‌మునై వద్ద బంగళాఖాతంలో హిందూమహాసముద్రం సంగమిస్తుం ది. రామేశ్వరానికి వచ్చే భక్తులు, పర్యాటకులు రోజూ అరిచల్‌మునైకి చేరుకుని స్నానమాచరిస్తారు. రెండు సముద్రాలు కలిసే చోట ఇసుకదిబ్బలను ఆసక్తిగా తిలకిస్తుంటారు.
ఇక ధనుష్కోటి తీరంలో గత కొద్ది రోజులుగా సముద్రజలాల ప్రవాహవేగం, గాలి వేగంలో మార్పులు చోటచేసుకుంటున్నాయి. రెండు రోజుల ముందు సముద్ర ప్రవాహంలో వచ్చిన మార్పుల కారణంగా అరిచల్‌మునైలోని మొదటి ఇసుకదిబ్బ ప్రాంతం రెండుగా చీలిపోయింది. ఆ చీలిన ప్రాంతంలో సముద్ర జలాలు వేగంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పర్యాటకులు సముద్ర సంగమ ప్రాంతాన్ని ఆనందంగా తిలకిస్తున్నారు. రామేశ్వరం ఆలయానికి వెళ్లిన భక్తులు దనుష్కోటికి వెళ్లి ఈ అరుదైన దృష్యాన్ని సాక్ష్యంగా నిలుస్తున్నారు.
ధనుష్కోటి తీరానికి ఐదేళ్లుగా జీపు నడుపుతున్న డ్రైవర్ మురుగేశన మాట్లాడుతూ ధనుష్కోటి అరిచల్‌మునై మొదటి ఇసుకదిబ్బను ఇప్పటిదాకా దూరం నుండే చూసేవారమనీ, ప్రస్తుతం సముద్ర ప్రవాహంలో వచ్చిన మార్పు కారణంగా ఆ ఇసుకదిబ్బపైకి వెళ్లి రెండు సముద్రాల సంగమ ప్రాంతాన్ని చూడటానికి వీలుపడిందనీ చెప్పారు. ప్రస్తుతం అరిచల్‌మునైలో మినీ దీవిగా మారిన మొదటి ఇసుక దిబ్బ ప్రాంతాన్ని తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యంలో తరలివస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more