ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పనామా పేపర్స్ లో తాజాగా మరికొంత మంది బాలీవుడ్ స్టార్ల పేర్లు బయటకు వచ్చాయి. మొన్న అమితాబచ్చన్, ఐశ్వర్యల పేర్లను వెల్లడించిన పనామా పేపర్స తాజాగా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, కరిష్మాకపూల్ పేర్లను వెల్లడించింది. ఐపీఎల్ బిడ్డింగ్‌లో విఫలం కావడంతో ఈ కంపెనీని మూసివేశారు. మొత్తం పదిమంది కలిసి ఈ కంపెనీ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 15% వాటా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నమోదైన ఆబ్డురేట్ లిమిటెడ్ అనే ఆఫ్‌షోర్ కంపెనీకి కేటాయించాలనేది ఆ ఒప్పందంలో కీలక అంశం. మిగిలిన దాంట్లో 33 శాతం పారిశ్రామికవేత్తలైన చోర్దియా కుటుంబానికి, బాలీవుడ్ హీరోయిన్లు కరీనా,కరిష్మాలకు చెరో 4.5%, సైఫ్‌కు, ముంబైకి చెందిన మనోజ్ ఎస్ జైన్‌కు చెరో 9%, వీడియోకాన్ గ్రూప్ పారిశ్రామికవేత్త వేణుగోపాల్ ధూత్‌కు చెందిన రెండు కంపెనీలకు 25% వాటాలు ఖరారు చేశారు. తనకు 25% వాటా ఉండేదని, ఆబ్డురేట్ గురించి తనకు తెలియదని ధూత్ అన్నారు. మరోవైపు అతుల్ చోర్దియా తమ గ్రూప్ 100% వాటా కలిగి ఉండేదని, ఆఫ్‌షోర్ కంపెనీలో ఎలాంటి వాటాలు లేవని అన్నారు.
పనామా పేపర్స్ లో భాగంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో స్పోర్ట్స్ రంగానికి సంబంధించిన మరో వివాదంకూడా వెలుగు చూసింది. స్పోర్ట్స్ ప్రమోటర్, ట్వంటీఫస్ట్ సెంచరీ మీడియా ఎండీ లోకేశ్శర్మకు బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్‌లో రిజిష్టరైన రెండు కంపెనీలున్నాయి. మూడో కంపెనీ ట్వంటీఫస్ట్కు అనుబంధ కంపెనీగా నమోదైంది. దీనిపై శర్మ స్పందిస్తూ మార్గరీటా సర్వీసెస్ అనే కంపెనీని టేకోవర్ చేద్దామనుకున్నప్పటికీ అది జరగలేదని చెప్పారు. మర్దీగ్రాస్ హోల్డింగ్స్, పెప్పర్మింట్ మేనేజ్నెంట్ అనే రెండు కంపెనీలు నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేశామని, పన్ను ఎగవేతలేమీ లేవని స్పష్టం చేశారు. ఈయన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి, బీజేపీ నాయకత్వానికి సన్నిహితుడని అంటున్నారు. గురువారం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన జాబితాలో ఢిల్లీకి చెందిన ఓడీలరు, బ్యూటిక్ యజమాని, ఆస్ట్రేలియా గనుల కుబేరుని కుమార్తె, టెక్స్టైల్ ఎగుమతిదారు, ఇంజినీరింగ్ కంపెనీ యజమాని, చార్టర్డ్ అకౌంటెంట్, లోహాల కంపెనీ డైరెక్టర్ల పేర్లు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more