Not act of God act of fraud

Not act of god act of fraud

Modi, Bengal, West Bengal, mamata Banerjee, kolkata, Act of God, Act of Fraud

ccusing West Bengal chief minister Mamata Banerjee of indulging in politics over the dead, Prime Minister Narendra Modi on Thursday said the Kolkata flyover tragedy was "god's message" to people to save Bengal from the Trinamool Congress.

యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు.. యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్

Posted: 04/08/2016 08:21 AM IST
Not act of god act of fraud

దేశంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల సభల్లో భాగంగా నాయకులు ఘాటు ఘాటు మాటలతో వేడిపుట్టిస్తున్నారు. కలకత్తాలో కూలిన ఫ్లై ఓవర్ పై రాజకీయ విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఫ్లై ఓవర్ కూలిన ఘటన పై మమతా బెనర్జీ వామపక్షాల మీద మండిపడితే.. మోదీ మమత మీద మండిపడ్డారు. యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఫ్లైఓవర్ కూలితే అనడం సరికాదు.. అది యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ అని అభివర్ణించాడు. మమత మీద మోదీ మరోసారి విమర్శలు చేస్తూ.. ఎంతసేపు ఆమె దృష్టి పదవిపైనేకానీ.. చనిపోతున్న వారు ఆమెకు కనిపించలేదు అని మోదీ పేర్కొన్నారు. విపత్కర సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మమత రాజకీయాలకు పాల్పడ్డారు అని మోదీ విమర్శించారు. బెంగాల్ అభివృద్ధిపట్ల మమతకు ఏమాత్రం శ్రద్ధలేదనటానికి కేంద్రం నిర్వహించిన సమావేశాలకు ఆమె హాజరుకాకపోవడమే నిదర్శనమన్నారు.

పశ్చిమబెంగాల్‌ను ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పాలన నుంచి దేవుడే రక్షించాలని ప్రధాని నరేంద్రమోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అవినీతి వల్లే కోల్‌కతా ఫ్లైఓవర్ ప్రమాదం జరిగిందని, టీఎంసీ అవినీతి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈ ఘటన ద్వారా దేవుడు ఓ సందేశం పంపించారని పేర్కొన్నారు. మమతాబెనర్జీ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మోదీ.. టీఎంసీ నేతల అవినీతికి శారదా కుంభకోణం ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. టీఎంసీ.. టెర్రర్, హత్యలు, అవినీతి సంస్థగా మారిందన్నారు.ైఫ్లెఓవర్ కూలినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? బాధితులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటారు. సహాయ కార్యక్రమాలకు చేదోడుగా నిలుస్తారు. కానీ.. మమతాబెనర్జీ మాత్రం సంఘటనా స్థలానికి వచ్చి రాజకీయాలు మాట్లాడారు అని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Bengal  West Bengal  mamata Banerjee  kolkata  Act of God  Act of Fraud  

Other Articles