తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని (ఉగాదిని పురస్కరించుకుని) కోయంబత్తూరులో అంబికా ముత్తుమరియమ్మ అమ్మవారు మునుపెన్నడూ లేని విధంగా భక్తులకు అభయాన్ని ఇస్తున్నారు, నూతన వంవత్సరాన్ని పురస్కరించుకుని అమ్మవారి వినూత్నంగా అలంకరించారు. కరన్సీనోట్లు, బంగారం, వజ్రాలతో అలంకరించి, అమ్మవారికి కొత్త శోభ తెచ్చారు. ఇందుకోసం రూ. ఐదు కోట్ల నగదు, కేజిన్నర బంగారం వినియోగించారు. తమిళ నూతన సంవత్సరం మొదటి రోజు ఉగాది పండగను అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలతో పలు ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.
కోయంబత్తూరులోని అంబికాముత్తుమరియమ్మ ఆలయంలో కూడా ఏటా ఉగాది వేడుకలు కన్నుల పండువగా జరుగుతాయని భక్తులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రతిఏటా అమ్మవారికి నగదు, బంగారంతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. పక్షం రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత కరెన్సీ నోట్లను భక్తులకు పంచుతారని, వీటిని తమ ఇళ్లలో, కార్యాలయాల్లో పెట్టుకుంటే తమ వ్యాపారాలు వృద్ది చెందుతాయని, ఇళ్లలో కూడా ఆదాయానికి లోటు లేకుండా వుంటుందని భక్తలు విశ్వాసం.
కాగా తాజాగా ఈ ఏడాది అమ్మవారి విగ్రహానికి బంగారు తాపడం చేయించారు. అభయ హస్తం ఇస్తున్న అమ్మవారికి బంగారు తాపడం చేయించడంతో విగ్రహానికి కొత్త కళ వచ్చింది. వెయ్యి రూపాయల నోట్లతో ఆలయాన్ని అలంకరించారు. ఆలయంలో ఎటు చూసినా డబ్బే డబ్బు. ఆలయ ముఖద్వారం నుంచి అంతర్భాగం మొత్తం నోట్లతో అలంకరించారు. అమ్మవారి విగ్రహం ముందు బంగారు నాణాలు, రత్నాలు, వజ్రాలు కుప్పలుగా పోశారు. అంబికా అమ్మవారిని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more