Women activists reject Trimbakeshwar's rider for entry, file complaint

Trimbakeshwar temple allows entry of women with rider activists resent

Trimbakeshwar temple, Women's entry into sanctum sanctorum, Swarajya Sanghatana, Vanita Gutte, temple trustee Lalita Shinde, Trimbakeshwar Devasthan Trust, Swarajya Sanghatana, Haribhau Kolhe, Trimbakeshwar police station,

The Trimbakeshwar Devasthan Trust in Maharashtra has decided to allow women into the sanctum sanctorum of Shiva temple for an hour everyday, but with a rider that they must wear wet cotton or silk clothes while offering prayers in the core area.

త్రియంబకేశ్వరం గర్భగుడిలోకి అనుమతి.. షరతులపై మహిళల ఆగ్రహం

Posted: 04/15/2016 05:47 PM IST
Trimbakeshwar temple allows entry of women with rider activists resent

ఆలయాల్లోకి మహిళలను ఎందుకు అనుమతించడం లేదు.. హింధువులంటే హిందువులే.. వారిలో పురష హిందువు, మహిళా హిందువు అంటూ తేడాలు లేవని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించడంతో దేశంలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలోకి మహిళలను అనుమతిస్తున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీలు సమావేశమే మహిళలను గర్బగుడిలోకి అనుమతిస్తూ నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ శైవక్షేత్రం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోక తప్పలేదు,

అదే మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం త్రియంబకేశ్వరం. ఆ చారిత్రాత్మక ఆలయం గర్భగుడిలోకి మహిళలను అనుమతించేందుకు ఎట్టకేలకు ఆలయ ట్రస్ట్ అంగీకరించింది. అయితే ఆలయ ప్రవేశానికి ఎలాంటి షరతులు విధంచని ఆలయ ట్రస్టు.. గర్బగుడిలోకి ప్రవేశించేందుకు మాత్రం పలు షరతులు విధించింది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఓ గంట మాత్రమే మహిళలను గర్భగుడిలోకి అనుమతిస్తామని చెప్పారు. దీనికి తోడు గర్భగుడిలోకి ప్రవేశించాలనుకునే మహిళలు ఆ సమయంలో తడిగా ఉన్న కాటన్ లేదా సిల్క్ దుస్తులు ధరించాలన్న నిబంధన విధించారు.

పూణేకు చెందిన స్వరాజ్య సంఘటన్ అనే మహిళా సంస్థ పోరాటం మేరకు దిగివచ్చిన ఆలయ ట్రస్టు ఈ అనుమతులకు అంగీకరించింది. అయితే ఆలయ కమిటీ నిర్ణయించిన షరతులపై ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధారణ దుస్తులతో గర్భ గుడిలోకి అనుమతించకపోవడంపై వనితా గుత్తే నేతృత్వంలోని మహిళా కార్యకర్తలు సుమారు 250 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి దీనిపై స్పందిస్తామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొందరు స్థానిక మహిళలు షరతులు పాటించి అనుమతించిన గంట సమయంలో గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు నిర్వహించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles