రింగింగ్ బెల్స్ పేరు వినగానే ఇంకా దేశంలోని స్మార్ట్ ఫోన్ ప్రియుల చేవుల్లో ఇంకా బెల్స్ రింగవుతునే వున్నాయి. దేశంలోనే అత్యంత కారుచౌకగా స్మార్ట్ పోన్లను తయారు చేసి అందుబాటులోకి తీసుకోస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ ఫ్రీడమ్ 251 పేరుతో నమూనాను కూడా చూపించి అభిమానులకు అశలు రేపింది. తీరా ఆరా తీస్తే.. అసలు అద్దెకే దిక్కులేక అనేక కష్టాలు పడుతుందని, ఇక వారు చూపించిన నమూనా తామూ తయారు చేసిందని, దానిని మూడు వేలకు అందించామని పలు అరోపణలను ఎదుర్కోని చివరకు కేసుల చట్రంలో చిక్కుకుంది,
ఆ రింగింగ్ బెల్స్ సంస్థ ఫోన్ పై కథలు కధలు ఇంకా చెబుతూనే వున్న తరుణంలో మరో అత్యంత చవకైన ఫోన్ ను అందుబాటులోకి తీసుకోచ్చింది మరో సంస్థ. అదే 'డొకోస్' సంస్థ 888 రూపాయలకు స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని ప్రకటించింది. పెద్ద ఆర్భాటమేమీ లేకుండా ప్రారంభోత్సవం చేసుకున్న ఈ సంస్థ తన మొదటి మోడల్ పేరును 'డొకోస్ ఎక్స్ 1' గా ప్రకటించింది. తన వెబ్ సైట్ ద్వారా ఫోన్లను అమ్మకానికి పెట్టేసింది. మే 2లోగా ఫోన్లను అందిస్తామని .. క్యాష్ ఆన్ డెలివరీ విధానం కూడా అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.
కొనుగోలుదారులు ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్ బుక్ చేసుకోవాలని కోరుతూ వెబ్ సైట్లో వివరాలను పెట్టింది. అయితే, మొబైల్ నమూనాను పోస్టర్ ద్వారా చేపించిన డోకోస్ సంస్థ.. ఫోన్ ఫీచర్స్ కూడా వెల్లడించింది. 1,3 గిగాహెర్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్ తో రూపోందించిన ఈ ఫోన్ లో 1జిబి రామ్, 4 ఇంచుల స్ర్కీన్, డ్యూయల్ సిమ్, 1300 ఎంఎహెచ్ లిథియమ్ బ్యాటరీ, 3జీ టెక్నాలజీ, అండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఓఎస్, 4జిబీ ఇంటర్నల్ మెమరీలతో అందించనుంది. అయితే మెమరీని 32జీబి వరకు పోడగించుకునే వెసలుబాటు కల్పించింది. సంస్థను గురించి కొద్దిపాటి వివరాలను మాత్రమే అందుబాటులో ఉంచిన డొకోస్ .. సెల్ కొనుగోలు కోసం కాల్ చేయొద్దని కేవలం ఎస్ఎంఎస్ మాత్రమే చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more