Pratyusha Banerjee and Rahul Raj Singh’s last phone conversation will send chills down your spine!

Pratyusha banerjee s last conversation with rahul raj

Pratyusha Banerjee, Rahul Raj Singh, Dindoshi sessions court, Justice Mridula Bhatkar,Last Conversation,Pratyusha Banerjee,Pratyusha Banerjee suicide case, kamya punjabi, shashank vyas, saloni, palguni, vikas gupta, Pratyusha Banerjee death

This disturbing conversation between Pratyusha Banerjee and her boyfriend Rahul Raj Singh happened an hour before she committed suicide.

ప్రత్యూష బెనర్జీ.. రాహుల్ తో మాట్లాడిన చివరి ఫోన్ సంభాషణలు..

Posted: 04/27/2016 08:45 PM IST
Pratyusha banerjee s last conversation with rahul raj

చిన్నారి పెళ్లికూతరు (బాలికా వధు) టీవీ సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ.. చివరిగా తన బాయ్ ఫ్రెండ్ కు తాను చనిపోతున్న విషయాన్ని చెప్పిందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి, ఎందుకంటారా,,? ప్రత్యూష మాట్లాడిన చివరి ఫోన్ కాల్ సంభాషణలో తాను అమె ఇంటికి వస్తున్నానని, వచ్చే వరకు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన చెప్పడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది, దీనిని బట్టి అమె ఆత్మహత్య చేసుకుంటున్న విషయం అతనికి తెలుసా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రత్యూషను హింసించిన కారణంగానూ ఇలాంటి పరిణామాలను రాహుల్ ఊహించారా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సూసైడ్ చేసుకున్న బాలికా వధు నటి ప్రత్యూష బెనర్జీ, తన ప్రియుడు రాహుల్ తో జరిపిన చివరి ఫోన్ కాల్ హిస్టరీ ఆడియోను కోర్టుకు సమర్పించారు పోలీసులు. దాదాపు మూడున్నర నిముషాల నిడివి ఉన్న ఈ ఆడియోలో ప్రత్యూష రాహుల్ ల మధ్య ఉన్న విభేదాలు తేటతెల్లమయ్యాయి. ఆత్మహత్యకు ఒక గంట ముందు ప్రత్యూష రాహుల్ తో మాట్లాడింది.

ప్రత్యూష: నన్ను క్యారెక్టర్ లేనిదానిలా ముద్రవేశారు. చంపుతామని బెదిరిస్తూ నాకు, మా అమ్మానాన్నలకు కాల్స్ వస్తున్నాయి. నాకు జీవితంలో ఇంకేం మిగిలిందిప్పుడు?

రాహుల్ : ఇవేమి పెద్ద విషయాలు కాదు

ప్రత్యూష : రాహుల్, దయచేసి నీ ఈగోను పక్కనపెట్టు. ఇవేమి పెద్ద విషయాలు కాదని ఎలా చెబుతావు


ప్రత్యూష ఇంకా ఏదో మాట్లాడుతుండగా రాహుల్ ఫోన్ కట్ చేశాడు.

మరో కాల్ కలిసిన తర్వాత..

ప్రత్యూష : నవ్వు మోసగాడివి. నన్ను వంచించావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను విడదీశావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో.

రాహుల్ : ఏమైంది. నేను ఇంటికి వచ్చి నీతో మాట్లాడతాను. ఇంటికి వస్తున్నాను. నేను ఇంటికి వచ్చే వరకు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకు.

ఇదీ సూసైడ్ కు ముందు ప్రత్యూష, రాహుల్ మధ్య జరిగిన సంభాషణ. ఇద్దరికీ మధ్య తలెత్తిన విభేదాల కారణంగా, ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. రాహుల్ మాటల్లో ప్రత్యూష పట్ల నిర్లక్ష్యం ఉండటం ఇక్కడ గమనార్హం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pratyusha Banerjee  Rahul Raj Singh  Justice Mridula Bhatkar  Last Conversation  

Other Articles