భగత్ సింగ్ ఓ ఉగ్రవాది | Delhi University book calls Bhagat Singh 'revolutionary terrorist'

Delhi university book calls bhagat singh revolutionary terrorist

Bhagath Singh, India, Terrorist, Delhi University, Revolutionary terrorist, భగత్ సింగ్, ఉగ్రవాది, దిల్లీ యూనివర్సిటి

A book which forms part of the Delhi University's history curriculum calls Bhagat Singh a "revolutionary terrorist", prompting the freedom fighter's family to raise the issue with university authorities as well as the HRD ministry.

భగత్ సింగ్ ఓ ఉగ్రవాది

Posted: 04/28/2016 07:25 AM IST
Delhi university book calls bhagat singh revolutionary terrorist

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు భగత్ సింగ్ పై ఢిల్లీ యూనివర్సిటీ చరిత్ర పుస్తకం ఒకటి ఉగ్రవాదిగా ముద్ర వేసింది. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకంలోని 20వ అధ్యాయంలో భగత్‌సింగ్ ఒక్కడే కాదు.. చంద్రశేఖర్ ఆజాద్, సూర్యసేన్ మరికొందరిని విప్లవ ఉగ్రవాదులు అని పేర్కొంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ చరిత్రకారులు బిపిన్‌చంద్ర, మృదులాముఖర్జీ రచించారు. చిట్టగాంగ్ ఉద్యమాన్ని ఉగ్రవాద చర్యగా, శాండర్స్ హత్యను ఉగ్రవాదంగా ఆ పాఠ్యభాగం అభివర్ణించింది.

భగత్‌సింగ్‌ను ఉగ్రవాదిగా పేర్కొనడంపై ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులకు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు తమ నిరసన తెలిపారు. సదరు పాఠ్యపుస్తకంలో మార్పులు చేసేందుకు చొరవ తీసుకోవాలని మంత్రి స్మృతి ఇరానీని డిమాండ్ చేశారు. డీయూ వైస్ చాన్స్‌లర్ యోగేశ్‌త్యాగిని భగత్ కుటుంబ సభ్యులు కలిసినప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. పరాయిపాలన నుంచి విముక్తి కలిగి 68 ఏళ్లవుతున్నా దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకోసం ప్రాణాలర్పించిన విప్లవకారుల గురించి ఇంకా ఇటువంటి పదాలు వాడుతుండటం విచారకరమని భగత్‌సింగ్ మేనల్లుడు అభయ్‌సింగ్ సంధు అన్నారు. అయితే ఆ పుస్తకం పాఠ్యపుస్తకం కాదని, రిఫరెన్స్ పుస్తకం మాత్రమేనని ఢిల్లీ వీసీ అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles