'Kejriwal Should Apologise To The Nation,' Says Amit Shah Displaying PM Modi's Degree

India modi s education record made public to halt row

Amit Shah, Arun Jaitley, PM Narendra Modis degree, Arvind Kejriwal, Delhi University, Gujarat University, date of birth, digvijay singh, congress, aap, bjp

Amit Shah and Arun Jaitley says It is unfortunate that we have to clarify on PM Narendra Modi's qualifications.

నరేంద్రమోడీ విద్యార్హతలు బహిర్గతం.. మరి జన్మదినమో..?

Posted: 05/09/2016 08:44 PM IST
India modi s education record made public to halt row

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత వివరాలు కేంద్రం పెద్దలు బహిర్గతం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని విద్యార్హతల వివరాలు వెల్లడించారు. ఆయన స్నాతకపూర్వ(బీఏ)విద్యతోపాటు, స్నాతకోత్తర విద్య(పీజీ)ను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. మోదీ విద్యార్హతలపై అనుమానాలు వ్యక్తం చేసి, అబద్ధాలు చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

మోదీ బీఏను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో.. రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్యను గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారని వెల్లడించారు. 'ఒకరి వ్యక్తిగత విషయంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేముందు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజనిజాలు ఏమిటో తెలుసుకోవాలి. మోదీ విద్యార్హతలను నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. దేశానికి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి' అని అమిత్ షా అన్నారు.

దీంతో నరేంద్రమోడీ విద్యార్థతల విషయమై రేగిన ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పడింది. కాగా నరేంద్రమోడీ జన్మదినం విషయంలో మాత్రం కేంద్రమంత్రి అరుణ్ జైటీ కానీ, అమిత్ షా కాని ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అసలు అ విషయమై ఏలాంటి ప్రకటనా చేయలేదు, దీంతో ఆయన జన్మదినం విషయమై మాత్రం ఇంకా క్లారిటీ లోపించినట్లుంది. ఇప్పటికీ మోడీ జన్మదినానికి సంబంధించి కాంగ్రెస్ సీనీయర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. దేశ ప్రధానికి చదువు లేకపోయినా పర్వాలేదు కానీ రెండు జన్మదినాలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles