Top new features on WhatsApp include video calls and group chat invites

Whatsapp to soon get video calling support report

whatsapp video calling, video calling on whatsapp, whatsapp new features, whatsapp, whatsapp features, social media, chat app, facebook, smartphones, ios, android, technology, technology news

Along with the rumoured call back button, zip file sharing support and voicemail, WhatsApp might also bring in many more important features.

వాట్సాప్ లో భలేభలే ఫీచర్లు.. డాటా బాలెన్స్ వుంటే చాలు..

Posted: 05/10/2016 09:51 AM IST
Whatsapp to soon get video calling support report

వాట్సాప్‌ తన యూజర్ల కోసం ఇప్పటికే పలు ఫీచర్లును అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది. స్కైప్‌, యాపిల్ ఫేస్‌టైమ్‌ వంటి పోటీ యాప్స్‌ ను తట్టుకొని నిలబడటానికి వాట్సాప్ నిరంతరం శ్రమిస్తునే వుందనడానికి ఇదే ఒక చక్కటి ఉదాహరణ. తాజాగా తన కస్టమర్ల కోసం మరో ఫీచర్‌ను వాట్సాప్‌ యాడ్ చేయడానికి రెడీ అవుతుంది. అదేంటంటే.. వీడియో కాలింగ్ సదుపాయం. డాటా బాలెన్స్ వుంటే చాలు ఇక ఫోన్ అవసరం లేకుండా అన్ని పనులు వాట్సాప్ లోనే పూర్తి చేసుకునేలా పావులు కదుపుతోంది.

'వీడియో కాల్స్‌'తో పాటు మరిన్ని మేజర్ ఫీచర్లను కూడా యాడ్ చేసేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. కాల్ బ్యాక్‌, వాయిస్ మెయిల్‌, జిప్ ఫైల్ షేరింట్ వంటివి సపోర్ట్ చేసేవిధంగా వాట్సాప్‌ను తీర్చిదిద్దుతోంది. ఆండ్రాయిడ్ పోలీసు వెబ్‌సైట్ కథనం ప్రకారం బెటా వెర్షన్ వాట్సాప్‌ వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. ఈ ఫీచర్‌ త్వరలోనే యాప్‌ కు చేర్చే అవకాశముందని, దీని స్క్రీన్‌ షాట్స్‌ను కూడా అది పోస్టు చేసింది.

నిజానికి గత ఏడాది డిసెంబర్ నుంచే వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్‌పై వదంతులు షికారు చేస్తున్నాయి. ఇదిగో వచ్చింది.. అదిగో వచ్చింది అంటూ దీని గురించి ఊరిస్తూ కథనాలు వచ్చాయి. ఇతర భాషల నుంచి అనువదించుకునే స్ట్రీంగ్స్‌ను వాట్సాప్‌ యాడ్ చేసిన తర్వాత వీడియో కాల్ వచ్చేసిందంటూ కొన్ని దేశాల్లో కథనాలు హల్‌ చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిస్ కాల్ ఫీచర్‌ ను జోడించిన వాట్సాప్‌ త్వరలోనే వీడియో కాల్‌ అవకాశాన్ని కూడా చేర్చవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  video calls  voice calls  

Other Articles