PM Modi's degrees flashed by Amit Shah fake and forged, alleges AAP

Aap says will visit du to inspect pm modis records

Amit Shah, Arun Jaitley, PM Narendra Modis degree, AAP leader Ashutosh, Arvind Kejriwal, Delhi University, Gujarat University, date of birth, digvijay singh, congress, aap, bjp

"PM Narendra Modi's degrees shown by Amit Shah and Arun Jaitley are fake and forged," senior AAP leader Ashutosh said as he asked how the two degrees have two different names.

బీజేపి నేతలు బహిర్గతం చేసిన మోడీ డిగ్రీలు నకిలీవే..

Posted: 05/10/2016 10:34 AM IST
Aap says will visit du to inspect pm modis records

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తమ అరోపణలను కోనసాగిస్తూనే వుంది. నరేంద్రమోడీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ పట్టా తీసుకున్నాడన్న కామెంట్లను అ పార్టీ ఖండిస్తూనే వస్తుంది. నరేంద్రమోడీ విద్యార్హత సర్టిఫికెట్లుగా బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బహిర్గతం చేసిన దృవపత్రాలను నకిలీవని అరోపించింది., ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ మాత్రం... అవి ఫోర్జరీ సర్టిఫికెట్లనీ, ఢిల్లీ యూనివర్శిటీకి వెళ్ళి తాము స్వయంగా రికార్డులు పరిశీలిస్తామని వెల్లడించారు.

మోడీ విద్యార్హతలుగా పేర్కోంటూ సర్టిఫికెట్లను బీజేపి బహిర్గతం చేసిన వెనువెంటనే అప్ సీనియర్ నేత అసుతోష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ పేరు.. రెండు డిగ్రీల్లో వేరు వేరుగా ఉందని ఆరోపిస్తున్నారు. అలా ఎందుకు వుందని ఆయన ప్రశ్నించారు. ఇలా ఎవరికైనా వుంటుందా అంటూ ఆయన నిలదీశారు. తన వద్ద ఉన్న మోదీ విద్యార్హతల కాపీలకు, షా చూపించిన వాటికి తేడా ఉందని, అందుకే అవి నకిలీవిగా తేలిపోయిందన్నారు. మోదీ పేరు బిఏ, ఎంఏ డిగ్రీల్లో వేరు వేరుగా ఉందన్నారు.

బిఏ పార్ట్ 1 లో నరేంద్ర కుమార్ దామోదర్ దాస్ మోదీ అని ఉండగా... రెండో సంవత్సరం మార్కు షీట్ లో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని ఉందన్నారు. అయితే మోదీ ఎంఏ తొలి ఏడాదిలో తన పేరును నరేంద్ర కుమార్ దామోదర్ దాస్ మోదీగా పేర్కొన్నట్లు గుజరాత్ యూనివర్శిటీ తెలిపింది. రెండో సంవత్సరంలో పేరులోని కుమార్ ను తీసేసి నరేంద్ర దామోదర్ దాస్ మోదీగా మార్చుకున్నారని తెలిపింది. ఇలా ఎవరి సర్టిఫికెట్లలోనైనా వుంటుందా..? అని అసుతోష్ ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఆప్ నేతలు..  బిజెపి ప్రెసిడెంట్ అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతో కలసి ఢిల్లీ యూనివర్శిటీలో మోదీ సర్టిఫికెట్ల రికార్డులను పరిశీలించేందుకు నిర్ణయించారు. కేజ్రీవాల్ వద్ద  సీఐసీ ఆర్డర్ ఉన్నపుడు ఢిల్లీ యూనివర్శిటీ  మోదీ డిగ్రీల అసలు పత్రాలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని... వాటిని సీల్డ్ గా ఉంచి, ఎందుకు భయపడుతున్నారని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ధైర్యం ఉంటే మోదీ సర్టిఫికెట్లలో పేరు మార్చుకున్న విషయంపై అఫిడవిట్ ఇవ్వాలని ఆప్ నేత అశుతోష్ బిజెపికి ఛాలెంజ్ విసిరారు. కాగా తాము మోడీకి సంబంధించిన విద్యార్హతలను సల్డ్ గా వుంచామన్న వార్తలను డిల్లీ యూనివర్సిఠీ తోసిపుచ్చింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendramodi  degrees  public  amit shah  fake  AAP leader Ashutosh  

Other Articles