Vijay Mallya dud cheque case: Court asks GMR to get 'correct address'

Cheque bounce case against vijay mallya adjourned to june 6

vijay mallya, mallya, dud cheque case, vijay mallya dud cheque case, kingfisher chairman vijay mallya, gmr airport, maharashtra police, vijay mallya court, vijay mallya correct address, vijay mallya address

Vijay Mallya is charged with defaulting airport user and the cheque issued by him got bounced because of having "insufficient funds in the account".

విజయ్ మాల్యా చెక్కు బౌన్సు కేసులో మరో ట్విస్టు..

Posted: 05/25/2016 05:20 PM IST
Cheque bounce case against vijay mallya adjourned to june 6

బ్యాంకుల్లో రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా చెక్బౌన్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. జీఎంఆర్ సంస్థ నమోదు చేసిన చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు జారీ చేసిన వారెంట్ను ముంబై విలేపార్లే పోలీసులు తిప్పిపంపారు. కాగా మాల్యా నివాసాన్ని ఎస్బీఐ సీజ్ చేసిందని, కింగ్ఫిషర్కు చెందిన యాజమాన్యం, ఉద్యోగులెవరూ లేరని ముంబై పోలీసులు బుధవారం లిఖితపూర్వకంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో మాల్యా కొత్త చిరునామాను జూన్ 6లోగా తెలపాలని పోలీసుల్ని ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించింది.  

విజయ్ మాల్యాకు మన్మోహన్ సింగ్ గ్యారంటీ

అలాగే మాల్యాకు మరోసారి వారంట్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. కాగా విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌వేస్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ను వాడుకున్నందుకు గాను జీఎంఆర్ సంస్థకు గతంలో విజయ్ మాల్యా చెక్కులను సమర్పించారు. అయితే, ఈ చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay malya  cheque bounce  erramanzil court  GMR  

Other Articles