గెలుపు మనుషులను పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే, ఎంతటి గెలుపునైనా నిరాడంబరంగా స్వీకరించేవాళ్లు కొందరైతే, తమ గెలుపును అందరికంటే వినూత్నంగా చాటుకోవాలని ఉబలాటపడేవాళ్లు మరికొంతమంది. డెన్మార్క్ మహిళా హ్యాండ్ బాల్ టీమ్ కూడా ఈ రెండో కోవకు చెందినదే. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన మహిళల హ్యాండ్ బాల్ జట్టు చివరకు గెలుపొందింది. గత నాలుగేళ్లో వరుసగా మూడోసారి ఈహెచ్ఎఫ్ ట్రోఫిని సొంతం చేసుకున్న డెన్మార్క్ హోల్ స్ట్రెబో మహిళల జట్టు తమ విజయాన్ని ఓ న్యూడ్ పోజ్ ద్వారా ప్రపంచం ముందు పెట్టింది.
టీమ్ లోని మహిళలంతా బాత్ రూమ్ లోని షవర్ కింద ట్రోఫి పట్టుకుని న్యూడ్ పోజ్ ఇచ్చారు. కాగా.. ఇది మహిళల క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్య అని కొందరు వాదిస్తుంటే, ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు టీమ్ లోని మహిళలు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెన్మార్క్ రష్యా మధ్య జరిగిన ఫైనల్ గెలుపుపై ఉత్కంఠ రేపింది. మ్యాచ్ ప్రథామర్థంలో రష్యా జట్టు ఆధిక్యం దిశగా కనిపించినా.. చివరికి 61:52 తేడాతో డెన్మార్క్ చేతిలో ఓడిపోయింది. దీంతో గెలుపు సంబరాల్లో మునిగిపోయిన డెన్మార్క్ `హ్యాండ్ బాల్ మహిళల టీమ్ ఇప్పుడు ఈ న్యూడ్ ఫోట్ తో అందరి నోటా హాట్ టాపిక్ గా మారింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more