సరిహద్దు లో వివాదానికి ఏ మాత్రం తీసిపోదు తెలంగాణ -ఏపీ నేతల మధ్య మాటల యుద్దం. అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చాలని చూస్తున్నారంటూ ఏపీ విపక్షాలన్నీ ఏకమై కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే, వారికి ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ లు ఇస్తున్నారు టీ నేతలు. ముఖ్యంగా జగన్ జలదీక్ష సమయంలో ఆ పార్టీ నేతలంతా ఓకింత పరుష పదజాలాన్నే వాడారు. దీంతో వార్ ముదురుతుందని అంతా అనుకున్నారు. ఇది పక్కనపెడితే హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో కాసేపటి క్రితం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయం (టీఆర్ఎస్ఎల్పీ)లో ఏపీ విపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యక్షమై హడావుడి చేశారు.
ఇంతకీ మ్యాటరేంటంటే పాలేరు ఉపఎన్నికలో తుమ్మల నాగేశ్వరావు భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. టీడీపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరిన ఈ సీనియర్ నేతకు తెలంగాణ సీఎం కేసీఆర్ తొలుత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, ఆపై మంత్రి పదవిని కట్టబెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో తుమ్మలను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది టీఆర్ఎస్. సానుభూతి గాలిని సైతం చేధించి మరీ రికార్డుస్థాయిలో బంపర్ మెజారిటీతో గెలిచాడు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తుమ్మల ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు కాసేపటి క్రితం అసెంబ్లీకి చేరుకున్నారు. ఇదే సమయంలో రాజ్యసభకు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అసెంబ్లీకి వచ్చారు. సాయిరెడ్డితో పాటు కూడా వచ్చిన కొడాలి నాని, జోగి రమేశ్ లు.. నేరుగా టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లి తుమ్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో తుమ్మల, కొడాలి నాని టీడీపీలో పని చేయటం, ఆ చనువుతోనే ఇలా తుమ్మలకు గ్రీటింగ్స్ చెప్పటం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మీడియా ఈ ఆసక్తికర భేటీని కెమెరాలతో బంధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more