పాలన అంటే దోచుకోవటం కాదు | Modi Emotinal Speech at Sahanpur Parva Rally

Modi emotinal speech at sahanpur parva rally

PM narendra modi, Sahanpur Parva Rally, UP, మోదీ, షహరాన్ పూర్ పర్వా ర్యాలీ, national news, mosi news, political news, politics

Modi Emotinal Speech at Sahanpur Parva Rally. modi full speech at Sahanpur Parva Rally.

పాలన అంటే దోచుకోవటం కాదు

Posted: 05/26/2016 06:42 PM IST
Modi emotinal speech at sahanpur parva rally

ఏళ్ల తరబడి దేశాన్ని దోచుకున్న వారికి తమ ప్రభుత్వం గురించి ప్రశ్నించే హక్కు లేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం యూపీలోని షహరాన్ పూర్ లో ఏర్పాటు చేసిన వికాస్ పర్వా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలను, అవి సాధించిన విజయాలను ఒక్కొక్కటిగా వివరిస్తూనే కాంగ్రెస్ పై ఆయన విరుచుకుపడ్డారు.

ఓవైపు 120 కోట్ల భారతీయులకు సేవకుడిలా తాను పనిచేస్తున్నానని, అభివృద్ధి కంటగింపుగా మారి కొందరు ఎన్డీయే ప్రభుత్వంపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పాలన అంటే దేశాన్ని దోచుకోవటం కాదు, అభివృద్ధి చేయటం అని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదర్కున్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. కేంద్రం నుంచి నిధులు బదలాయిస్తేనే రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయి. కానీ, యూపీఏ ఆ పని ఎన్నడూ చేయలేదు.  తమ ప్రభుత్వం ఆ పని చేస్తోందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఇదే సమయంలో తాను ప్రమాణస్వీకారం చేశానని, ఆ సమయంలో దేశంలో మతతత్వం పెరుగుతుందని కొందరు వ్యాఖ్యానించారు. కానీ, జరుగుతుంది ఏంటో ప్రజలకు తెలుసు. ఓటు బ్యాంకు కోసం వారు చేసిన ఆరోపణలకు ప్రజలు చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారు. ఇస్తూనే ఉంటారు కూడా అని అన్నారు. దేశంలో తాము అధికారంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయన్న ఆయన కొంతమంది ఆలోచనల్లో మాత్రం మార్పులు రావటం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్ కు చురకలు అంటించారు. ఏవరేమనుకున్నా తన పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, వారికి ఎప్పడూ అండగా ఉంటామని ఆయన ప్రకటించారు.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM modi  Sahanpur Parva Rally  two years ceebrations  

Other Articles