మరో ఈశాన్య రాష్ట్రంపై కమలం కన్ను? | after assam BJP eyed on meghalaya

After assam bjp eyed on meghalaya

meghalaya, BJP, congress, internal crisis, మేఘాలయా, బీజేపీ, కాంగ్రెస్, సంక్షోభం, latest news, political news, telugu news

after assam BJP eyed on meghalaya. As the crisis for Congress deepens in Meghalaya, party’s state unit has accused Bharatiya Janata Party (BJP) leader Ram Madhav of seizing the opportunity emerging out of the controversy. In an SOS sent to the central high command on Wednesday, the state unit of the party urged Congress president Sonia Gandhi and vice president Rahul Gandhi to take decisive action in the matter.

మరో ఈశాన్య రాష్ట్రంపై కమలం కన్ను?

Posted: 06/01/2016 06:43 PM IST
After assam bjp eyed on meghalaya

దేశంలో కాంగ్రెస్ హస్తంలో ఉన్నరాష్ట్రాలను ఒక్కోక్కటిగా  తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్న బీజేపీ ఇప్పుడు మరోదానిపై కన్నేసింది. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవటంతో దాన్ని వాడుకుని వరుసగా అన్ని రాష్ట్రాల్లో అదికారం చేపట్టాలని ప్లాన్ వేసింది. తాజాగా అసోంలో ఇలాంటి విజయాన్నే సాధించిన కమలం చూపు ఇప్పుడు మేఘాలయా పై పడింది . ప్రస్తుతం మేఘాలయా కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొంది. దీంతో ఆ గొడవలను ఆసరాగా తీసుకుని అధికారంలోకి రావాలని యోచిస్తోంది.

ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి అసంతృప్తిగా ఉన్న వారంతా బీజేపీతో టచ్ లో ఉన్నారంట. వీరందరూ బీజేపీ సీనియర్ నేతలైన హేమంత బిశ్వాస్, రామ్ మాధవ్ లతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా చేరింది దీంతో నష్టనివారణకు రాహుల్ అతిత్వరలో అక్కడ పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.. షిల్లాంగ్ లో  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ ఇద్దరు తమ కీలక నేతలకు గాలం వేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంతేకాదు గరో, ఖాసీ తెగల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తద్వారా అధికారంలోకి వద్దామని బీజేపీ ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే మేఘాలయా అసెంబ్లీలో కూడా చిన్నది కావటం, పైగా ఇద్దరు, ముగ్గురు మాత్రమే పార్టీ మారే అవకాశం ఉండటంతో ఈ వ్యవహారం కూడా మరో ఉత్తరాఖండ్ రాజకీయాల్లా మారే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : meghalaya  BJP  congress  internal crisis  telugu news  

Other Articles