Pakistan girl burned to death for refusing marriage proposal

Pakistan school teacher burned alive in murree dies in hospital

Pakistani girl burnt alive, Marriage proposal, Pakistan, Pakistan, marriage proposal, burned alive, woman teacher, Crime against women, Violence against women

A teenage Pakistani girl died on Wednesday, two days after she was tortured and set on fire for refusing to marry a divorcee twice her age.

మరో ప్రేమోన్మాధి ఘాతుకం.. ప్రేమను తిరస్కరించిందని..

Posted: 06/01/2016 08:01 PM IST
Pakistan school teacher burned alive in murree dies in hospital

పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పిందన్న కారణంతో ఓ స్కూలు టీచర్ ను సజీవ దహనం చేశారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువతి చివరికి తనువు చాలించింది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. పాక్ రాజధాని ఇస్లామాబ్ కు సమీపంలోని ముర్రీ ప్రాంతంలో మరియా సదాఖత్(19) అనే స్కూల్ టీచర్ పై కొందరు దుర్మార్గులు దారుణంగా ప్రవర్తించారు. అమ దారిని అడ్డగించి దారుణానికి పాల్పడ్డారు.

ముందుగా యువతిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నించారు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనై సజీవ దహనానికి యత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆమె అంకుల్ తెలిపారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న సదాఖత్ నేడు చనిపోయిందని తెలిపారు. సదాఖత్ ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్ గా పనిచేస్తుందని, ఆ స్కూలు ప్రిన్సిపాల్ తన కొడుకును వివాహం చేసుకోవాలని ఆమెను కోరాడు.

పెళ్లికొడుకు వయసు తనకంటే రెట్టింపు ఉందని, అతడు అది వరకే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడన్న కారణంతో పెళ్లికి నో చెప్పింది. టీచర్ జాబ్ కూడా వదిలేసింది. చనిపోయేముందు ఈ ఘటనపై ఆమె వాంగ్మూలం ఇచ్చిందని, ప్రిన్సిపాల్ తో పాటు మరో నలుగురు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్టేట్ మెంట్ ఇచ్చిందని పోలీస్ అధికారి మజార్ ఇక్బాల్ తెలిపారు. నిందితులలో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  marriage proposal  burned alive  woman teacher  

Other Articles