Ajit Jogi set to float new party, says Cong made compromises

Ajit jogi hints at quitting congress

ajit jogi, ajit jogi new party, new party, congress, chhattisgarh, raman singh, bjp, chhattisgarh bjp, chhattisgarh congress

After years of infighting within the Chhattisgarh Congress, senior party leader Ajit Jogi announced his intention to form a new political front “to free the state from the BJP-led Raman Singh government”.

కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత గుడ్ బై..

Posted: 06/03/2016 11:54 AM IST
Ajit jogi hints at quitting congress

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి.. సీనియర్ నేత ఝలక్ ఇవ్వనున్నారా..? రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసేపనిలో కాంగ్రెస్ శ్రేణులు తనమునలవుతున్న తరునంలో పార్టీకి చెందిన సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి పార్టీని వీడనున్నారన్న వార్తలు సంచలనంగా మారాయి. ఇదే నిజమైతే కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నాయకత్వానికి మరో గట్టి దెబ్బ తగులుతోంది. అజిత్ జోగి కాంగ్రెస్‌కు గుడ్ నైట్ చెప్పి, సొంత పార్టీ పెట్టుకోడానికి సిద్ధమయ్యారన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇంతకుముందు అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ నాయకత్వం.. ముఖ్యంగా రాహుల్ గాంధీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి చెంది ఇద్దరు పెద్ద నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. వారలో హిమాంత బిశ్వ శర్మ అసోంలో బీజేపీ విజయం వెనుక కీలకంగా మారగా, ఉత్తరాఖండ్‌లో మాజీ సీఎం విజయ్ బహుగుణ అయితే రావత్ ప్రభుత్వాన్ని దించేశారు. ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ భూపేష్ బఘెల్ మీద తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను గానీ, వాళ్లకు 'గుడ్ నైట్' మాత్రం చెబుతానని జోగి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

జోగి వెళ్లిపోతే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం తప్పదని అంటున్నారు. 'గేదెల ముందు వేణువు ఊదడం' ఎందుకంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానాన్ని ఉద్దేశించివనేనని, వీటిని రాష్ట్ర పార్టీ గమనిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి శైలేష్ నితిన్ త్రివేదీ చెప్పారు. ఈనెల ఆరో తేదీన తన మద్దతుదారులతో సమావేశమై తదుపరి కార్యాచరణను నిర్ణయించుకుంటానని అజిత్ జోగి చెబుతున్నారు. సీనియర్ నేతలు బాఘెల్, టీఎస్ సింగ్‌దేవ్ లాంటి వాళ్లకు సొంత ప్రయోజనాలు ఉన్నాయని, భూముల వ్యవహారంలో తమపై కేసులు రాకూడదనే బీజేపీ సర్కారుపై వాళ్లు పోరాటం చేయలేకపోతున్నారని జోగి మండిపడ్డారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajit jogi  new party  raman singh  bjP  Congress  chhattisgarh  

Other Articles