చెప్పుతో పెద్ద మంటపెట్టాడు | hightension in yadiki over jagan slipper slap comments on babu

Hightension in yadiki over jagan slipper slap comments on babu

chandrababu naidu, jagan, yadiki, anantapur, YSRCP, jagan comments, చంద్రబాబు నాయుడు, జగన్ చెప్పు కామెంట్లు, telugu news, latest news

high tension in yadiki over jagan slipper comments on chandrababu. Ananthapur senior leaders slapped jagan.

చెప్పుతో పెద్ద మంటపెట్టాడు

Posted: 06/03/2016 01:42 PM IST
Hightension in yadiki over jagan slipper slap comments on babu

అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రతో ఉద్రికత్త వాతారణం నెలకొంది. నవ నిర్మాణ దీక్షను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశాడు. పెద్ద వడుగూరులో గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును చెప్పుతో కొట్టాలంటూ ఆయన ఘాటుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. దీంతో అనంత తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. జగన్ యాత్రను అడ్డుకుని తీరాతామంటూ నిరసనలకు దిగారు. వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇంకోవైపు సంస్కారం లేకుండా జగన్ మాట్లాడుతున్నాడంటూ టీడీపీ సీనియర్లంతా మండిపడుతున్నారు. వరుసగా ఒక్కోక్కరు మీడియా ముందుకు వచ్చి జగన్ ను తిట్టిపోస్తున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య కూడా ఇలాంటి నీచపు సంవాదం జరగలేదంటూ వారంతా చెబుతున్నారు. కడప రాజకీయాలను అనంతకు విస్తరించేందుకు చిచ్చు రగల్చాలని చూస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో యాడికిలో జగన్ యాత్రను అడ్డుకుంటామని పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి ప్రకటన చేయటంతో కార్యకర్తలు అంతా రోడ్డు మీదకు వచ్చారు. పోటీగా వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీకి దిగారు. ఇరువర్గాలు ఎదురుపడితే మాత్రం ఏం జరుగుతుందోనని పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. భారీ సంఖ్యలో బలగాలు మోహరించి పరిస్థితి చెయ్యి దాటకుండా సమీక్షిస్తున్నారు. జగన్ యాత్రను అడ్డుకుంటే సహించేది లేదని చెబుతూ వైసీపీ కార్యకర్తలు కూడా ఇప్పటికే యాత్ర వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోకముందే... జగన్ యాత్రను అడ్డుకునేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులను పోలీసులు వెనక్కు పంపారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న వైసీపీ శ్రేణులు విషయం తెలుసుకుని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ జగన్ కు ఘన స్వాగతం పలికారు.

గత రాత్రి నుంచి నేతలతో పలుమార్లు చర్చలు జరిపిన జగన్ నిరసనలు వెల్లువెత్తినా వెనకడుగు వేసేది లేదని డిసైడ్ అయి భరోసా యాత్ర కొనసాగింపునకు సిద్ధమయ్యారు. ఓ వైపు వైసీపీ కార్యకర్తలు... అక్కడికి కూతవేటు దూరంలో టీడీపీ శ్రేణులు మధ్యలో భారీ సంఖ్యలో పోలీసులతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నాలుగు కూడలి జంక్షన్ కి చేరుకున్న జగన్ ప్రసంగానికి సిద్ధమయ్యాడు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  chandrababu naidu  yadiki  anantapur  YSRCP  latest news  

Other Articles