ఇలాంటి ఓ ఘటన జరుగుతుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారంటూ నమ్మి బడికి తమ పిల్లలను పంపే తల్లిదండ్రులకు ఇది పెద్ద షాకింగ్ న్యూసే. ఆమెకు 24 ఏళ్లు ఓ స్కూల్లో టీచర్. అతనికి 13 ఏళ్లు స్కూల్లో ఆమె దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాడు. కానీ, ఆ గురుశిష్య బంధం అంతటితో ఆగలేదు. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు అనుకున్న ఆ టీచర్ ఓ అడుగు ముందుకేసింది. ఆ విద్యార్థితో సెక్స్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు శృంగారంలో పాల్గొంది. చివరికి అతగాడి దయతో గర్భం దాల్చింది. ప్రస్తుతం లైంగిక దాడి కేసును ఎదుర్కొంటోంది. పవిత్ర బంధాన్ని హేళన చేసిన ఈ ఘటన వివరాళ్లోకి వెళితే...
టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండ్రియా వెరా అల్‌డైన్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో ఇంగ్లీష్ టీచర్. తన విద్యార్థుల్లోని ఓ అబ్బాయితో ఏడాది క్రితం పరిచయం పెంచుకుంది. ఆపై అదికాస్త శారీరక సంబంధం దాకా వెళ్లింది. గతేడాది సెప్టెంబర్ నుంచి వారు అదే పనిలో ఉండగా, చివరకు జనవరిలో ఆమె గర్భం దాల్చింది. అంతటితో వీరి చేష్టలు ఆగాయ అంటే అదీ లేదు. ఆ టీచర్ ను ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ అంటూ పేరేంట్స్ కి పరిచయం చేశాడా స్టూడెంట్. దానికి తోడు ఆ తల్లిదండ్రులు కూడా వీరి సంబంధానికి సపోర్ట్ ఇచ్చారు. అయితే విలన్ లే లేరనుకుంటున్న వీరి ప్రేమకు పెద్ద అవాంతరం వచ్చి పడింది. స్కూలు యాజమాన్యం మాత్రం వీరి బంధానికి సారీ చెప్పి ఆమెను ఉద్యోగంలోంచి తొలగించింది. ఆపై విషయం పోలీసులకు చేరవేయడంతో వారు చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీస్‌కు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో ఎట్టకేలకు అబార్షన్ చేయించుకుంది. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడి అజ్ఞాతంలోకి పారిపోయింది. చివరకు బుధవారం మోంట్‌గోమెరీ కౌంటీ పోలీసుల ఎదుట లొంగిపోయింది. లక్ష డాలర్ల బాండ్ సమర్పించిన అనంతరం ఆమెను విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం వారి రిలేషన్ షిప్ గురించి ఏ మాత్రం తెలీదంటున్నారు. అసలు ఇలాంటి పనులకు ఎవరైనా ఒప్పుకుంటారా అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. తమది స్వచ్ఛమైన ప్రేమంటూ ఆమె వాదిస్తున్నప్పటికీ ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దాల్సిందిపోయి ఇవేం పనులంటూ జనాలు ఆమెను ఛీ కొడుతున్నారు. గతంలో ఓ వ్యక్తి ద్వారా సంబంధం నడిపిన ఈమెకు ఇప్పుడు నాలుగేళ్ల కొడుకు ఉండటం ఇక్కడ కొసమెరుపు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more