1200 పెట్టి చంద్రబాబు ఏం చూశాడు? | chandrababu spend 1200 RS for watching srimanthudu

Chandrababu spend 1200 rs for watching srimanthudu

AP CM chandra babu, chandrababu srimanthudu, vijayawada mini theater in busstand, తాజావార్తలు, చంద్రబాబు శ్రీమంతుడు సినిమా, 1200 లతో శ్రీమంతుడు సినిమా, విజయవాడ బస్టాండ్ మినీ థియేటర్, latest news, telugu news

AP CM Chandrababu Naidu Launches Mini Theaters In Vijayawada bus stand. buying ticket for 1200 RS and watched srimanthudu movie.

1200 పెట్టి చంద్రబాబు ఏం చూశాడు?

Posted: 06/07/2016 12:59 PM IST
Chandrababu spend 1200 rs for watching srimanthudu

నిత్యం పాలనా వ్యవహారాలతో తాజాగా జగన్ వ్యాఖ్యలతో సతమతమవుతున్న ఏపీ సీఎం చంద్రబాబు కాస్త రిలాక్స్ అయ్యారు. నవ్యాంధ్ర రాజధాని కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఆయనకి ఊరట తీసుకునే సమయం ఎక్కడిది అనుకోకండి. అభివృద్ది పనులో భాగంగానే ఆయన ఈ ఎంజాయ్ మెంట్ చేశారు. ఎలా అంటారా? దేశంలోనే తొలిసారిగా విజయవాడ సోమవారం ఓ అరుదైన రికార్డును సాదించింది. దేశంలోనే మొదటిసారిగా బెజవాడ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో వైస్క్రీన్ థియేటర్‌ను నిర్మించింది ఏపీ ప్రభుత్వం. సోమవారం అమరావతి పనుల సమీక్షకు అనంతరం ఆయన అక్కడికి వెళ్లి దాన్ని ప్రారంభించారు కూడా. అయితే తోటి నేతలు ఒత్తిడి చేయటంతో ఆయన టికెట్ కొని మరీ సినిమా చూశారు.

ఇంతకీ ఆయన చూసిన సినిమా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు. ఇందుకోసం ఆయన పెట్టింది ఎంతో తెలుసా? 1200 రూపాయలు. మరీ అంతా అవసరమా అనుకోకండి. తన చేత్తో బోణీ చేస్తే బాగుంటుందని బావించిన ఆయన ఇలా అంత పెట్టి టికెట్ కొనేశారంట. చంద్రబాబుతోపాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్ధా రాఘవరావు, అధికారులతో కలిసి ధియేటర్ లో ‘శ్రీమంతుడు’ సినిమా చూశారు. అయితే సినిమా సాంతం చూడని ఆయన కాసేపటికే వేరే కార్యక్రమం ఉండటంతో వెళ్లిపోయారంట.

ఇక ఇలాంటి థియేటర్లను త్వరలో ప్రతి మండలంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యత్నాలు ప్రారంభించింది. వైఎస్‌టీడీ (వైస్క్రీన్ ట్రేడ్ డెవలప్‌మెంట్) పేరిట పిలువబడే ఈ సెంటర్లలో మిని థియేటర్‌తో పాటు పుడ్‌కోర్టు, మీసేవా, ఏటీఎం, సైబర్ కేఫ్, రిటైల్ మార్కెట్ తదితరాలు ఉంటాయి. గంటల తరబడి వెయిట్ చేయాల్సిన ప్రయాణీకులకు దీంతో కాలక్షేపం అందించడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవచ్చన్నమాట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles