కిర్లంపూడిలో హైటెన్షన్... వాహనంలోనే ఉద్యమనేత | High tension in kirlampudi at mudragada padmanabham house

High tension in kirlampudi at mudragada padmanabham house

mudragada padmanabham, kapu leader, hightension in kirlampudi, kirlampudi house, tuni arrests, తెలుగు వార్తలు, తాజా వార్తలు, ఏపీ రాజకీయాలు, latest news

High tension in kirlampudi at mudragada padmanabham house Held Over Kapu Violence

ITEMVIDEOS: కిర్లంపూడిలో హైటెన్షన్... వాహనంలోనే ఉద్యమనేత

Posted: 06/07/2016 05:36 PM IST
High tension in kirlampudi at mudragada padmanabham house

తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కిర్లంపూడిలోని ఆయన ఇంటి వద్దకు తీసుకోచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను నేరుగా తీసుకురాకుండా అమలాపురం నుంచి అటూ ఇటూ తిప్పి తీసుకురావటంపై ఆయన అనుచరులు తీవ్ర అసహనంలో ఉన్నారు. నేరస్థులను తీసుకొచ్చే వాహనంలో ఊర్లని తిప్పి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ అనుచరులు ఆయన ఇంటి గేట్లు మూసివేసి తాళాలు వేయగా, మద్దతుదారులు భారీగా కిర్లంపూడికి చేరుకుంటున్నారు.

కాగా, అంతకు ముందు పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన్ను బలవంతంగా రాజమండ్రి సీఐడీ ఆఫీస్ కు తరలించాలని ప్రయత్నించగా అది కుదరలేదు. ఆ సమయంలో ఆయన్ని వాహనం ఎక్కించాలని ప్రయత్నించిన ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులతో ముద్రగడ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనుచరులు అడ్డుకోవటంతో చివరికి ముద్రగడను బలవంతంగా ఆయన్ను కిర్లంపూడిలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. అయితే తీరా ఇంటికొచ్చాక ముద్రగడ పోలీసు వాహనం దిగకుండా, మౌనం వహించారు. తుని ఘటనలో తనను కూడా అరెస్ట్ చేయాలంటూ ఆయన తమను కూడా అరెస్టు చేయాలన్న డిమాండ్ తో ఆయన సీట్లోనే బీష్మించుకుని కూర్చున్నారంట. తనను బలవంతంగా వ్యాన్ నుంచి దించితే, మరోసారి స్టేషన్ ను ముట్టడిస్తానని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది.

source from NTV

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వారిని అరెస్టు చేశారని, అల్లర్లలో పాలుపంచుకున్న వారిగా చూపిస్తూ కాపులకు కళంకం తెచ్చేవిధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, వారిని తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసులో నిందితులుగా ఉన్నవారి జాబితాను తనకిస్తే, తానే స్వయంగా వారిని స్టేషనులో అప్పగిస్తానని, అమాయకులను భయాందోళనలకు గురిచేస్తే మాత్రం ఊరుకునేది లేదని ముద్రగడ హెచ్చరించినట్లు సమాచారం. ఒకవైపు కాపుల రిజర్వేషన్లు కల్పిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడటం వెనుక ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

కాగా, ముద్రగడతో చర్చల సారాంశాన్ని ఉన్నతాధికారులకు తెలిపిన పోలీసులు వారి నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. కిర్లంపూడిలో ప్రస్తుతం దుకాణాలు మూయించడంతోపాటు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada padmanabham  kapu leader  kirlampudi house  tuni arrests  

Other Articles