ఇకపై తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు పాతిక జిల్లాల సమాహారం కూడా. కొత్తగా 14 నుంచి 15 జిల్లాలను ఏర్పాటు చేసి మొత్తంగా 24 నుంచి 25 జిల్లాల సమాహారాన్ని రూపోందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాగా ఇందుకు కీలకంగా మారిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విభజన కొలిక్కి వచ్చింది. వీటి విభజనపై ముందునుంచీ గందరగోళం నెలకొనడం తెలిసిందే. రాజధానికి కేంద్రంగా విస్తరించిన గ్రేటర్ సిటీ కావటంతో దీన్ని ఎన్ని జిల్లాలుగా విభజిస్తారు, ఏ ప్రాంతాలను ఎందులో కలుపుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పలుమార్లు జరిగిన ఉన్నతాధికారుల సమావేశాల్లోనూ ఈ రెండు జిల్లాలపైనే సుదీర్ఘంగా తర్జనభర్జనలు జరిగాయి. ఆ జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వాటి పునర్ వ్యవస్థీకరణ కసరత్తును సీసీఎల్‌ఏ ఎట్టకేలకు పూర్తి చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు నాలుగు జిల్లాలుగా ఆవిర్భవిస్తాయి. హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ జిల్లాలుగా విభజిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను వీటిలో విలీనం చేస్తారు.
వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త జిల్లాకు రంగారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. ఏ ప్రాంతాలను ఏ జిల్లా పరిధిలో ఉంచాలనే విషయంలోనూ సీసీఎల్‌ఏ నమూనా మ్యాపులు సిద్ధం చేసింది. మొత్తం 14 లేదా 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెదక్ జిల్లాలో సిద్ధిపేట, సంగారెడ్డి; ఆదిలాబాద్‌లో మంచిర్యాల (కొమురం భీం జిల్లా); నిజామాబాద్‌లో కామారెడ్డి; ఖమ్మంలో కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా); కరీంనగర్‌లో జగిత్యాల, వరంగల్‌లో భూపాలపల్లి (ఆచార్య జయశంకర్ జిల్లా)గా చేయాలని ప్రతిపాదించారు,
ఇక మహబూబాబాద్; నల్లగొండ జిల్లాలో సూర్యాపేట; మహబూబ్‌నగర్‌లో నాగర్‌కర్నూల్, వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా ఏర్పాటు తుది పరిశీలనలో ఉంది. కరీంనగర్ జిల్లాకు ‘పీవీ నరసింహరావు జిల్లా’ అని పేరు పెట్టాలనే అభ్యర్థనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more