man uploads lover explicit videos on social media

Man arrested foa uploading explicit videos on social media

Girlfriend, Wedding, Explicit video, YouTube, Love, Cheat, Nude photos, crime, bajjara hills, begumpet, warangal, lover filmed nude, girl filmed nude by lover,

man films his lover nude videos and uploads them on social media after she got marraiges another man

ప్రియురాలి నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెట్టి..

Posted: 06/08/2016 07:01 AM IST
Man arrested foa uploading explicit videos on social media

తన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుని వెళ్లిపోయిందన్న అక్కస్సుతో అమె తనను ప్రేమించిన సమయంలో ఆమెకు తెలియకుండా చిత్రీకరించిన అసభ్య దృశ్యాలను వీడియోలు తీసిన అమె ప్రేమికుడు సోషల్ మీడియాలో పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా హన్మకొండ హసన్‌పర్తికి చెందిన యువతి(23) 2012 నుంచి 2014 వరకు ఉద్యోగ శిక్షణా తరగతుల్లో భాగంగా బేగంపేటకు వెళ్లేది. అక్కడే పనిచేస్తున్న శీలబోయిన అనిల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 2014లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రహ్మత్‌నగర్ గురుద్వార్ సమీపంలోని తన గదికి ఆమెను తీసుకెళ్లిన అనిల్ శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ దృశ్యాలను ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు.

ఇటీవల ఆమెకు మరొకరితో పెళ్లి అయింది. ఇది జీర్ణించుకోలేని అనిల్ ఆమెతో కలిసి నగ్నంగా ఉన్న ఫొటోలను యూట్యూబ్‌లో పెట్టాడు. గత నెల 2వ తేదీన యూట్యూబ్‌లో ఈ దృశ్యాలు చూసిన బాధితురాలి స్నేహితులు విషయాన్ని ఆమెకు తెలియజేశారు. అంతేకాకుండా అత్తవారింట్లో కూడా విషయం తెలియడంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆ నగ్న దృశ్యాలను అనిల్ యూట్యూబ్‌లో పెట్టాడని నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అనిల్‌పై ఐపీసీ సెక్షన్ 354(బి), 506, 509, 417, 420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girlfriend  Wedding  Explicit video  YouTube  Love  Cheat  Nude photos  crime  

Other Articles