Rejoice meme makers, WhatsApp may soon support GIF images

Whatsapp getting gif support soon

whatsapp gif feature, whatsapp video calling, whatsapp ios, whatsapp update, gif photos, new feature, apps, facebook, gif, gif images, gifs, social, viber, whatsapp

man films his lover nude videos and uploads them on social media after she got marraiges another man

స్మార్ట్ ఫోన్ ప్రియులకు కోసం.. వాట్సాఫ్ లో సరికోత్త ఫీచర్..

Posted: 06/08/2016 09:29 PM IST
Whatsapp getting gif support soon

ఫేస్‌బుక్ స్థానాన్ని క్రమంగా ఆక్రమించేసిన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు కేవలం ఛాటింగ్ ల కోసం వినియోగించిన వాట్సాప్ లో ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను జోడించనుంది. ఇక మీదట వాట్సప్‌లో జిఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయొచ్చు. ఈ విషయాన్ని ద నెక్స్ట్‌ వెబ్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ టెక్నాలజీలో వస్తున్న సరికొత్త మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ఈసారి కొత్తగా వాట్సప్‌ను అప్‌డేట్ చేసుకున్న తర్వాత అందులో జిఫ్ ఫొటోలు ఆటోప్లే అవుతాయి.

యూజర్లు కూడా నేరుగా జిఫ్ ఫొటోలను తమ చాట్‌లో ఎంబెడ్ చేసుకోవచ్చు. వాట్సప్ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ, ఇప్పటికే యాపిల్ ఐఫోన్లలోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు కూడా వస్తుందని అంటున్నారు. ఇది పూర్తయిన తర్వాత.. స్కైప్‌కు పోటీగా వెళ్లేందుకు త్వరలో వీడియో కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించేందుకు వాట్సప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ వినియోగదారులను సంతోషపర్చేందుకు నిత్యం కృషి చేస్తామంటున్న వాట్సాఫ్ యాజమాన్యం.. తమ అనునిత్యం తమ యూజర్లకు మరింత దెగ్గరకావాలని భావిస్తున్నామని తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : whatsapp  gif photos  new feature  

Other Articles