తుని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను బేషరుతుగా ఉపసంహరించాలని, అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలన్న తమ డిమాండ్లపై ఆ:ధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడకపోవడంతో తాను నిరవధిక దీక్ష చేయనున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తాను ఒక్కడినే దీక్షకు దిగుతున్నానన్నారు. రౌడీషీటరైనా, దోపిడీదారుడైనా, ఖూనీ కోరైనా.. ఆ కేసులు వేరని అన్నారు. కాపు గర్జన సభకు వచ్చిన వారిని అరెస్టు చేసి జైల్లో పెడితే వారిని రక్షించడం తమ బాధ్యతని అయనన్నారు.
అమరణ దీక్ష నేపథ్యంలో తనను అరెస్ట్ చేస్తే జైల్లో పెట్టినా.. అక్కడ కూడా తాను దీక్ష కొనసాగిస్తాను తప్ప బెయిల్ తీసుకోననని ముద్రగడ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనకు మూల కారకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసేవరకూ తానూ దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. తనను అరెస్టు చేయమనే నిన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని చెప్పుకోచ్చిన ఆయన దీక్ష చేస్తే నన్ను కూడా అరెస్టు చేస్తామని మంత్రులు చెప్పడం విడ్డూరంగా వుందన్నారు.
తనను జైల్లో ఉంచితే కాపు ఉద్యమం నాయకులు లేక ఉద్యమం చల్లారుతుందని ప్రభుత్వం బావిస్తున్నట్లు వుందని, ఉద్యమాన్ని ఎలా నడిపాలి, ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్నది తమ నాయకులు చూసుకుంటారు’ అని అన్నారు. తన దీక్ష వద్దకు వివిధ గ్రామాల నుంచి వచ్చే జనాన్ని ఆపుతారని తెలుసని, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెడతారని తెలుసని, తనను ఒంటరిని చేయాలని, మీడియా కవరేజ్ లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతుందనీ తనకు తెలుసని ముద్రగడ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more