Actor turned politician Riteish Hospitalised

Kollywood actor ritesh hospitalised

Actor turned politician Riteish,kollywood actor ritesh hospitalised, ritesh heart stroke, ritesh mild heart stroke, ritesh hospitalised

Actor turned politician Riteish, has been hospitalised as he had suffered mild heart stroke in gym

గుండెపోటుతో అస్పత్రిలో చేరిన నటుడు..

Posted: 06/09/2016 09:45 AM IST
Kollywood actor ritesh hospitalised

సినిమా తారాలు కూడా ఈ మధ్యకాలంలో క్రీడాకారులు మాదిరిగా మధ్యవయస్సులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు రితీశ్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. రితీశ్ తక్కువ చిత్రాలలోనే నటించినా.. కాలీవుడ్ తో పాటు తమిళనాడు ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకున్నారు, ఆయన కానల్‌నీర్, నాయగన్, పెన్‌సింగం తదితర చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.

 రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న రితీశ్ డీఎంకే తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత ఆయన అన్నాడీఎంకేలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా ఆయన అన్నాడీఎంకే పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. రెండు రోజుల క్రితం జిమ్‌కు వెళ్లినప్పుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో నిర్వాహకులు మైలాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్సలు పొందుతున్నారు. అధిక రక్తపోటు కారణంగానే రితీశ్ అనారోగ్యానికి గురయ్యాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles