షాక్: ఓటుకు నోటు కేసు క్లోజయ్యింది | Jerusalem mathaiah says Cash-for-vote scam closed

Jerusalem mathaiah says cash for vote scam closed

Jerusalem mathaiah, Cash-for-vote scam, telangana govt, mathaiah telangana govt, mathaiah highcourt, జరూసలెం మత్తయ్య, ఓటుకు నోటు కేసు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, తెలంగాణ, latest news, telugu news

Jerusalem mathaiah says Cash-for-vote scam closed. demanded telangana govt should ignore the topic.

షాక్: ఓటుకు నోటు కేసు క్లోజయ్యింది

Posted: 06/09/2016 09:52 AM IST
Jerusalem mathaiah says cash for vote scam closed

విభజన తర్వాత ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చింది ఓటుకు నోటు కేసు. ప్రస్తుతం తెలంగాణ సీఐడీ పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారా? ప్రధాన నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డే అయినప్పటికీ దీనికి మధ్యవర్తిత్వం వహించింది మాత్రం క్రైస్తవ సంఘాల నేత జెరూసలేం మత్తయ్య అని తెలిసిందే. తెలంగాణ ఏసీబీ పోలీసులకు ఝలక్కిచ్చిన పరారయిన మత్తయ్య ఆపై ఏపీలో మకాం పెట్టాడు. అయితే హైకోర్టు నుంచి అరెస్ట్ భయం లేదంటూ హామీ వచ్చిన హైదరాబాదులో అడుగుపెట్టాడు.

ఆపై జెరుసలేం మత్తయ్యకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. తెలంగాణ ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మత్తయ్యపై వచ్చిన ఆరోపణలపై కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై కేసు కొట్టివేసిన మరుక్షణమే ఓటుకు నోటు కేసు శకం ముగిసిందంటూ పేర్కొన్నాడు. ఇక ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం పక్కనబెట్టాలని, పూర్తిగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. విపక్ష పార్టీ ఓటేయాలంటూ భారీగా ముడుపులు ఎరవేశారన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఈ తీర్పుతో ఆరోపణలు అబద్ధాలని తేలిపోయిందని కూడా మత్తయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా డబ్బు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ప్రస్తుత టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles