uttar pradesh police fight on road over share of bribe video goes viral on web

Up cops fight on road over share of bribe

police fight for bribe share, up police fight, police fight for money, cops fight for money, lucknow, up, uttar pradesh, fight between police, lucknow police fight video, viral video, trending video, up cops, cops fight, police fight, policemen fighting, cops fight on road, cops bribe fight, lucknow

Policemen in Lucknow were seen fighting with each other on road over a share of bribe. The incident was caught on camera

ITEMVIDEOS: వీళ్లు.. పోలీసులే.! లంచంలో వాటాల కోసం నడిబజారులో..

Posted: 06/27/2016 09:50 AM IST
Up cops fight on road over share of bribe

పోలీసులంటే సమాజంలో రోజురోజుకూ గౌరవ మర్యాదలు క్షీణిస్తున్నాయి. అయితే ఇందుకు ప్రజల్లో వస్తున్న మార్పులు మాత్రం కారణం కాదు. స్వతహాగా పోలీసులే వారి గౌరవాన్ని వారు తగ్గించుకుంటున్నారన్న వార్తల్లో నిజాలు వున్నాయి. కొందరు పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదిలేసి అమరులుగా నిలుస్తూ యావత్ ప్రజల నుంచి గౌరవ మర్యాదలు పొందుతున్నా.. అందుకు భిన్నంగా ప్రవర్తించే పలువురు మాత్రం చిన్న చిన్న అంశాలపై కూడా పొట్లాడుకుంటున్నాడు.



నమ్మశక్యంగా లేదా.? కానీ ఇది నిజం.. ఏదో చిన్న విషయంగా వారి మధ్య తలెత్తిన గోడవ ఘర్షణకు దారి తీసింది. అయితే పట్ట పగలు, అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు కలబడ్డారు. ఒకరిపై మరొకరు పడి దొర్లారు. జనం చూస్తున్నారన్న ఇంగిత ఙ్ఞానం కూడా లేకుండా వారు పిడి గుద్దులు కురిపించుకున్నారు. వారేం మద్యం మత్తులో లేరు. నిక్షేపంగా విధులు నిర్వహిస్తున్నారు. మరి ఎందుకోసం పోట్లాడుకుంటున్నారా? అప్పటిదాకా నలుగురూ కలిసి వసూలు చేసిన లంచాల కోసమేనట. వారి మధ్య లంచాల పంపకాల వాటాలలో తేడాలు రావడంతో వారు రౌడీల కన్నా దారుణంగా పోట్లాడుతున్నారు.

ఇదంతా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ రోడ్డుపై నిన్న పట్టపగలు చోటుచేసుకున్న ఘటన. అప్పటిదాకా నలుగురూ కలిసి ట్రక్కుల డ్రైవర్లు, వీధి వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేశారు. అయితే పంపకాల్లో తేడా వచ్చింది. కలిసి వసూలు చేసిన లంచాల్లో వాటాల వద్ద పేచీ వచ్చింది. ఇంకేముంది ఒకరిపై ఒకరు కలబడ్డారు.ఈ మొత్తం తతంగాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : up cops  cops fight  police fight  policemen fighting  cops fight on road  cops bribe fight  lucknow  

Other Articles