పైన పటారం.. లోన లోటారం.. అన్న నానుడి మనకు తెలిసిందే. సరిగ్గా అలాగే పైన బోర్డులో ఒక పేరు పెట్టి..లోన మాత్రం సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వుంది. అనేక మంది సంఘవ్యతిరేకులను పోలీసులు కటకటాలోకి నెడుతున్నా.. ఆ మార్గంలో నడుస్తున్నవారిలో మాత్రం మార్పు రావడంలేదు. ఇప్పటికే మసాజ్ సెంటర్ల పేరుతో నడుపుతున్న వ్యభిచార కేంద్రాలపై దాడులు నిర్వహిస్తూనే అనేక మంది నిర్వాహకులను జైలుకు తరలించిన పోలీసులు సవాలు విసిరేలా నేరస్థులు తయారవుతున్నారు.
మోడలింగ్ లో రాణించాలంటే తమ ప్రోడక్షన్ హౌజ్ లో చేరాలని ప్రకటనలు గుప్పించి.. అందమైన అమ్మాయిలను అకర్షించి.. ప్రముఖ మోడళ్లుగా తీర్చిదిద్దుతామని నమ్మించి.. వారి వ్యభిచారిణులగా మార్చే ఓ సంస్థపై పోలీసులు అకస్మికంగా దాడులు జరిపారు. మోడలింగ్ కేంద్రం మాటున జరుగుతున్న లోగుట్టును బట్టభయలు చేసిన పోలీసులు నిర్వాహకురాలిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై పోలీసులు నిన్న నగరంలోని వెర్సోరా ప్రాంతంలో రేఖా వైష్ణవ్ అనే 24 ఏళ్ల మోడల్ ను అరెస్ట్ చేశారు.
మోడలింగ్ తో పాటు సినీ వినీలాకాశంలో మెరిసిపోదామంటూ వచ్చి నానా ఇబ్బందులు పడుతున్న అమాయక యువతుల బలహీనతలనే లక్ష్యంగా చేసుకున్న ఆ మోడల్... ఏకంగా వ్యభిచార కూపాన్నే నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆ లేడీ మోడల్ విఆర్ ఎంటర్టైన్మంట్ పేరుతో ఏకంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా తెరచిందట. గుజరాత్, ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయిలతో న్యూడ్ ఫోటో షూట్ లు చేయించి వాటిని..వాట్సాఫ్ లో విటులకు పంపింది. విటుల నుంచి భారీగా డబ్బును ముందే లాగింది. అయితే ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆ మోడల్ నిర్వహిస్తున్న చీకటి వ్యాపారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిన్న ఆమె కార్యాలయంపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా ఇద్దరు మైనర్ బాలికలను వారు వ్యభిచార కూపం నుంచి రక్షించారు. ఆ తర్వాత మోడల్ ను అరెస్ట్ చేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more