కుక్క పాలకు బానిసైన బాలుడు | 10-year-old Dhanbad boy grows up on dog milk

10 year old dhanbad boy grows up on dog milk

Jarkhand kid addicted to dog milk, kid feed dog milk, dog giving milk to boy

Mohit 10 years old Dhanbad boy addicted to dog milk.

పదేళ్ల ఆ బాలుడు కుక్కలతో అలా...

Posted: 07/25/2016 06:32 PM IST
10 year old dhanbad boy grows up on dog milk

మనిషి పై నమ్మకం లేకనేమో ఒక బాలుడు కుక్కలపై ప్రేమాభిమానాలు పెంచుకున్నాడు. వాటితో స్నేహం వరకైతే ఆగితే బాగుడిందేది కానీ, ఓ మెట్టు పైకి ఎక్కి ప్రవర్తించసాగాడు.  జార్ఖండ్ లోని ధన్ బాద్ లో చోటు చేసుకున్న ఈ విచిత్రమైన ఘటనలోకి వెళ్లితే...  మోహిత్ కుమార్ (10) అనే బాలుడు రెండేళ్ల వయసప్పుడు తల్లిపాలు తాగడం మానేశాడు. సాదారణంగా పాలు మానేసిన తరువాత పిల్లలు మళ్లీ అలవాటు చేసుకోరు.  కానీ మోహిత్ కుమార్ మాత్రం నాలుగేళ్ల వయసప్పటి నుంచి వీధి కుక్కల పాలకు అలవాటు అయిపోయాడు.  

వీధుల్లో ఆడుకునేందుకు వెళ్లే మోహిత్ కు చిత్రంగా కుక్కలు కూడా పాలివ్వడం మొదలుపెట్టాయి. దీంతో వాటిని తాగడం మొదలుపెట్టాడు. ఓసారి కుక్కపాలు తాగుతున్న కుమారుడిని చూసి ఆ తల్లి షాక్ కు గురైంది. అదేమి అలవాటంటూ ఆమె అతడికి రెండు తగిలించింది. అయినప్పటికీ మోహిత్ అలవాటును మానుకోలేకపోయాడు. చుట్టుపక్కల వారు మోహిత్ కుక్కపాలు తాగుతూ కనిపించాడని ఫిర్యాదులు చేయడంతో విసిగిపోయి ఆ తల్లి కొడుకును ఇంట్లో నిర్బంధించింది.

చివరకు ఇకపై అలా చేయనని తల్లిని నమ్మించడంతో రెండు వారాల కిందట అతడిని వదిలింది. దీంతో బయటకు వెళ్లిన మోహిత్...మరో వీధిలో కుక్కపాలు తాగే ప్రయత్నం చేశాడు. మనోడి గురించి తెలియని కుక్క కదా సో కరిచేసేసింది.  దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చగా, కుక్కపాల వల్ల ఏం ప్రమాదం ఉండదని చెబుతూనే, మోహిత్ రేబిస్ బారిన పడటం ఖాయమని చెబుతున్నారు. పేదరికంతో ఈ అలవాటు మాన్పించడానికి సరైన వైద్యం చేయించలేకపోయారని తెలుస్తోంది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jarkhand  dhanbad  kid  mohit  dog milk  

Other Articles