ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 140 మంది వివాహేత మహిళలతో అక్రమ సంబంధాలు ఏర్పటు చేసుకున్న వ్యక్తిని ఏమంటారు. మగాడు కాదు మృగాడు కాదు కామపిశాచి అంటూ కూడా సరిపోదు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన ఇతడు కష్టాల్లో వున్న మహిళలను రక్షించే పవిత్రమైన పోలీసు ఉద్యోగంలో కోనసాగుతూ.. క్రైం కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇతగాడి బండారాన్ని వాడి కూతురే బట్టభయలు చేసింది. సొంత గూటికి చెందిన పక్షిని పరిరక్షించే పనిలో తన తండ్రి శాఖ ఉన్నతాధికారులు వుంటారేమోనని భావించిన అమె.. ఏకంగా తన తండ్రిపై న్యాయస్థానంలోనే పిర్యాదు చేసింది.
వివరాలలోకి వెళితే.. బరేలీకి చెందిన ఓ యువతి తల్లిని.. క్రైమ్ కానిస్టేబుల్ గా పనిచేసే వ్యక్తి రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే వివాహేతర సంబంధాల గురించి తెలిసిన తన సోదరుడ్ని కూడా అతగాడు హత్య చేశాడని, ఈ విషయం తెలిసిన తన తల్లిని కూడా నిందితుడు పోట్టనబెట్టుకున్నాడని అమె అరోపించింది. ఈ విషయాలు తెలిసి తాను ఎక్కడ బయటకు చెబుతానో అని బావించి.. కూతురు లాంటి తనపై కూడా అత్యాచారం చేశాడని యువతి అరోపిస్తూ.. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి మెజిస్ట్రేట్ కుసుమ్ లతా రాథోర్ వద్ద పిటిషన్ దాఖలు చేసింది.
తండ్రి స్థానంలో వుండి తనపై పాశవికంగా పైశాచిక మృగంలా నిందితుడు తెగబడిన ఘటనకు సంబందించిన వీడియోలను కూడా తాను తీశానని, వాటినే అధారాలుగా కోర్టుకు సమర్పిస్తున్నాని కూడా యువలి పిటీషన్ లో పేర్కోంది. ఇక తన తండ్రి ఏకంగా 140 మంది మహిళలతో అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నాడని కూడా పేర్కోంది. ఎవరెవరితో, ఎప్పడెప్పుడు, ఎక్కడెక్కడ కలిసిన వివరాలన్నింటినీ.. అతడు ఓ డైరీలో రాసుకున్నాడని దానిని కూడా అధారంగా న్యాయస్థానానికి సమర్పించింది.
సదరు అక్రమ సంబంధాల వివరాల డైరీని అతడు భద్రంగా తన ఇంటిలోని ఓ ట్రంకు పెట్టెలో దాచుకున్నాడని.. ఈ డైరిని అనుకోకుండా తన కంట పడిందని, దాంతోనే తాను ధైర్యం చేసిన న్యాయస్థానంలో సమర్పిస్తున్నానని చెప్పింది. 140 మందితో తన తండ్రి వెలగబెడుతున్న రాచకార్యంపై ఫిర్యాదు చేసింది. నిందితుడు నేరవిభాగానికి చెందిన కానిస్టేబుల్ కావడంతో ఏదో ఒక కేసులో సాక్షులుగానో, లేక నిందితులుగానో వున్న మహిళలను, లేని పక్షంలో నిందితుల భార్యలను బెదిరించి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుని వుండవచ్చని కూడా యువతి అరోపించింది. ఇక ఇతగాడి వివాహేతర సంబందాల జాబితాలో యూపీకి చెందిన ఓ మహిళా పోలీసు అధికారి కూడా ఉన్నారట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more