ఉద్దవ్ థాక్రేను కలిసిన రాజ్ థాక్రే | MNS chief Raj Thackeray met Shiv Sena president Uddhav Thackeray

Mns chief raj thackeray met shiv sena president uddhav thackeray

MNS chief Raj Thackeray met Uddhav Thackeray, Raj Thackeray and Uddhav Thackeray, MNS chief Raj Thackeray life, Uddhav Thackeray and Raj Thackeray, Thackeray brothers

MNS chief Raj Thackeray met Shiv Sena president Uddhav Thackeray.

పులి బిడ్డలు ఒకటయితే ఇక ఆపలేం

Posted: 07/30/2016 08:58 AM IST
Mns chief raj thackeray met shiv sena president uddhav thackeray

శివసేన, బీజేపీల మధ్య వైరం రాను రాను పెరిగిపోతుందా? వీరి మధ్య చిచ్చుతో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? సుదీర్ఘంగా చేతిలో చేయి వేసి నడిచిన మిత్రపక్షాల తమ బంధం పూర్తిగా తెంపెసుకోబోతున్నాయా?. రాష్ట్రంలో అధికారపార్టీకి మద్దతిస్తున్నప్పటికీ, కేంద్రంలో నాయకత్వ వైఖరితో సేన కమలంతో పూర్తిగా తెగదెంపులు చేసుకోబోతుందా?

రాజకీయ వారసత్వం కోసం విడిపోయిన థాక్రే సోదరులిద్దరూ దగ్గరవుతుందడటం దీనికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేను ఆయన నివాసం 'మాతోశ్రీ'కి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే వెళ్లి కలిశారు. ఈ కలయిక ఓ కుటుంబ కార్యక్రమం కోసమేనని అంటున్నప్పటికీ, రాజకీయాల కోసమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శివసేన అధినేత బాల్ ఠాక్రే అనంతరం కుమారుడు ఉద్దవ్ ఠాక్రే పార్టీ బాధ్యతలు స్వీకరించారు. బాల్ థాక్రే బతికున్నన్నాళ్లు ఆయన కుడి భుజంగా ఉన్న సోదరుడి కొడుకు రాజ్ థాక్రే, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో విభేదించి, సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే విడిపోవడం ద్వారా జరిగిన నష్టాన్ని సోదరులిద్దరూ గుర్తించినట్టు కనిపిస్తోందని, వారిద్దరూ ఒక్కటవ్వడం ద్వారా ఇతర పార్టీలకు ఇబ్బందులు తప్పవని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న మహా ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తాచాటి తరువాత జరగనున్న స్థానిక ఎన్నికల నాటికి మరింత బలోపేతం అయి అధికారంలో తిష్ఠ వేయాలని వారు భావిస్తున్నట్లు అర్థమౌతుంది. అదే జరిగితే బీజేపీకి రానున్నది గడ్డుకాలమే అని చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivasena  Uddhav Thackeray  MNS  Raj Thackeray  Bal Thackeray  

Other Articles