Amritsar Court Grants Bail To Arvind Kejriwal, Sanjay Singh In Defamation Case

Arvind kejriwal gets bail in defamation case in punjab

Arvind Kejriwal, Sanjay Singh, Defamation Case, Punjab Revenue Minister, Bikram Singh Majithia, drug issue, Khetan, AAP, BJP, Shiromani akalidal, Aam Aadmi Party,Politics,Law & Legal

Delhi Chief Minister Arvind Kejriwal and AAP leader Sanjay Singh were today granted bail by a local court in Amritsar after they appeared in connection with a defamation case filed by Punjab Revenue Minister Bikram Singh Majithia.

అరు నెలల్లో అరెస్టు చేయండి.. లేదా అరెస్టును ఎదుర్కోండి..

Posted: 07/30/2016 08:35 AM IST
Arvind kejriwal gets bail in defamation case in punjab

పంజాబ్ రెవెన్యూ మంత్రి బిక్రమ్ జిత్ సింగ్ ముమ్మాటికీ డ్రగ్స్ సరఫరాదారుడేనన్న వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉంటానని అప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రీవాల్ అన్నారు. పంజాబ్ అధికార పార్టీ నేతలు పెట్టే అక్రమ కేసులకు తాను బెదరనని ఆయన అన్నారు. అధికార పార్టీ నేతలు రానున్న అరు నెలల్లో తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. వారు కేవలం అరు మాసాలు మాత్రమే అధికారంలో వుంటారని అందువల్లే ఈ లోగా దమ్ముంటే తమను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో ఆ తరువాత అధికారంలోకి వచ్చే తమ పార్టీ.. అరు నెలల్లో ఆయనను అరెస్టు చేస్తుందని.. దానికి సిద్దం కావాలని బిక్రమ్ సింగ్ ను ఉద్దేశించి హెచ్చరించారు.

2017లో జరగనున్న ఎన్నికల్లో అకాలీదళ్- బీజేపీ కూటమికి ఓటమి తప్పదని, ఆప్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి కొత్త పంజాబ్(నయా పంజాబ్)ను సృష్టిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ బానిసలు కావచ్చు.. అక్రమ రవాణాదారులు కావచ్చు.. ఏదో ఒకవిధంగా పంజాబ్ లో మాదకద్రవ్యాల ప్రభావం పడని కుటుంబం లేదని కేజ్రీవాల్ అన్నారు. అన్ని రకాలుగా అద్భుతమైన రాష్ట్రాన్ని అధికార అకాలీదల్- బీజేపీలు ఆగం చేశాయని, పంజాబ్ ను డ్రగ్స్ హబ్ గా మార్చేశాయని విమర్శించారు. తనపై దాఖలైన పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొనేందుకు అమృత్ సర్ వచ్చిన కేజ్రీవాల్ కోర్టులో బెయిల్ మంజూరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అకాలీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు.

'పంజాబ్ లోని ప్రతి ఇల్లు డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటోంది. ఎవరైనా దీనిని ఎదిరిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి నోరుమూయిస్తున్నది' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ అక్రమ సరఫరా ముఠాతో పంజాబ్ రెవెన్యూ మంత్రి బిక్రమ్ జిత్ సింగ్ కు సంబంధాలున్నాయంటూ కేజ్రీవాల్, పంజాబ్ ఆప్ నేత సంజయ్ సింగ్ గతంలో చేసిన ఆరోపణలపై పరువునష్టం కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం తన ముందు హాజరైన కేజ్రీవాల్, సంజయ్ లకు కోర్టు బెయిల్ మంజూరు చేసి, విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. కాగా, విచారణ సందర్భంగా కోర్టు వద్దకు ఆప్, అకాలీదళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Sanjay Singh  Defamation Case  Bikram Singh Majithia  drug issue  

Other Articles