రియో ఒలంపిక్స్ కు అతిథ్యమిస్తున్న బ్రెజిల్ లో అపశృతులు చోటుచుసుకుంటున్నాయి. ఇప్పటికే నెల రోజుల క్రితం ఓ యువతిపై స్థానిక యువత జరిపిన గ్యాంగ్ రేప్ కేసు కలకలం సృష్టించగా, మరో వైపు ఉగ్రదాడులు జరుగుతున్నాయని వార్తలు వెలుగుచూసాయి. ఈ నేపథ్యంలో రియో ఒలంపిక్స్ కోసం అక్కడికి చేరుకున్న క్రీడాకారులు తాత్కాలిక నివాసం కోసం అక్కడి ఒలంపిక్స్ విలేజ్ లో బస ఏర్పాటు చేశారు. అయితే ఈ విలేజ్ లో అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవించడంతో క్రీడాకారులు అందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఆస్ట్రేలియా అథ్లెట్ల బృందం సురక్షితంగా బయటపడింది. అయితే ఈ ప్రమాదంలో క్రీడాకారులు ఎలాంటి గాయాలు కానీ, వారి కోసం ఏర్పాటు చేసిన రియో ఒలంపిక్ విలేజ్లో ఎలాంటి నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఒలంపిక్ విలేజ్ లోని అస్ట్రేలియా అథ్లెట్లు ఉన్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అపార్ట్మెంట్లో పొగలు వ్యాపించడంతో.. అథ్లెట్లను అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయించారని ఆస్ట్రేలియా జట్టు స్పోక్స్ పర్సన్ మైక్ టాంక్రెడ్ వెల్లడించారు. ఫైర్ అలారం మోగటంతో ఆటగాళ్లను అపార్ట్మెంట్ నుంచి బయటకు పంపినట్లు జిన్హువా మీడియా సంస్థ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఆటగాళ్లు తిరిగి అపార్ట్మెంట్లోకి వెళ్లారు. బిల్డింగ్ బేస్మేట్ ప్రాంతంలో మంటలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more