నయీం టాక్స్ పేరిట నల్గొండలో నయీం ఆరాచకాలు | gangster Naeem imposed special tax on businessmen

Gangster naeem imposed special tax on businessmen

Gangster Naeem Encounter, Gangster Naeem dairy, Naeem Tax in Nalgonda, gangster Naeem, Naeem aids

Gangster Naeem imposed special tax on businessmen in Nalgonda.

నయీం టాక్స్ గురించి మీకు తెలుసా?

Posted: 08/17/2016 03:23 PM IST
Gangster naeem imposed special tax on businessmen

డైరీల్లోని పేజీలు తిప్పేకొద్దీ గ్యాంగ్ స్టర్ నయీం నయా దందాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తన సొంత జిల్లా నల్గొండలో వ్యాపారస్థులను, రియల్టర్లను ఎలా భయభ్రాంతులకు గురిచేసేవాడో వెలుగులోకి వస్తున్నాయి. సినిమాల్లో చూపించినట్లు దుకాణాలు, రోడ్ సైడ్ చిల్లర వర్తకుల వద్దకు వెళ్లి ముక్కుపిండి మామూళ్లు వసూలు చేసే నయీంకి చెందిన రౌడీ మూకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డైరీ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకుని మరింత సమాచారం రాబడుతున్నారు.

‘నయీమ్’ నుంచి బీజేపి దూరం.. హోటల్‌లో దినేష్ రెడ్డి ప్రెస్ మీట్..

వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేసిన నయీం వారి నుంచి నెలనెలా పన్నులు వసూలు చేసేవాడంట. బడా రాజకీయ వేత్తలను బెదిరింపులకు గురి చేసిన నయీం పేరు చెబితేనే వణికిపోయిన వ్యాపారులు అతడు అడిగిన మేరకు కప్పం కట్టేవారట. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ నయాదందాను పోలీసులు ‘నయీమ్ ట్యాక్స్’గా పిలుస్తున్నారు.  ఇక నయీం చేతుల్లో ఆస్తులు పోగొట్టుకున్నవారు ఎక్కువ మటుకు నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారే. ఈ జిల్లాల్లోనే నయీం వందల ఎకరాలు కబ్జాపెట్టాడు. సిట్‌కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం తమ భూముల విలువను లక్షలు, కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. దీంతో, నయీం కబ్జా పెట్టిన, అతని ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని సిట్‌ అధికారులు భావిస్తున్నారు.

మరో మాజీ మంత్రితో లింకులు... నయీం టోల్ ఫ్రీకి నో రెస్పాన్స్

నయీం సీడీ డేటా వామ్మో...
దర్యాప్తు అధికారులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసే అంశాలు నయీం కేసు విచారణలో బయటపడుతున్నాయి. దాదాపు 7 టెరా బైట్లు (7000 జీబీ) స్టోరేజీని అతని ఇంట్లో సిట్ బృందం కనుగోంది. అంటే ఏకంగా 4 వేల సినిమాలకు సరిపడా సమాచారాన్ని అతను కంప్యూటర్లలో భద్రపరిచాడన్న మాట. కబ్జాలు, సెటిల్మెంట్లు.. వాటికి సంబంధించి స్కాన్‌ చేసిన డాక్యుమెంట్లు, ముఖ్యంగా బడా బాబులతో జరిపిన ఫోన్‌ సంభాషణలు, వీడియోలు మొదలైనవి వాటిలో ఉన్నాయి. సీడీలు, డీవీడీలు, పెన్‌ డ్రైవ్‌లు, మెమరీ కార్డులతోపాటు కంప్యూటర్లు, ల్యాప్‌టాపుల్లో ఈ డేటాను గుర్తించగలిగారు. గుట్టలకొద్దీగా పడి ఉన్న సీడీలను చూసి అధికారులు నోళ్లు వెళ్లపెట్టారు. రాజకీయ, పోలీస్‌, ఇతర ప్రముఖులతో తాను దిగిన ఫొటోలు, జరిపిన పార్టీల సమయంలో తీసిన వీడియోలను భద్రపరిచాడు. ఇవి గనక బయటికి వస్తే వారి పని అంతేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. తనకు ఎప్పటికైనా చావు తప్పదని భావించిన నయీం.. తనతో సంబంధాలు కలిగిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల చిట్టా అందరికీ తెలిసేందుకు, వారికి శిక్ష పడేందుకు ఇరవై ఏళ్ల డేటా భద్రంగా ఉంచాడు. నయీంకు ఐన వాళ్ల పైన ఎంత అనుమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.

నయీం ‘కోకోనట్’ రాసలీలు ఎంతలా అంటే...


భార్య, సోదరి కస్టడీ పొడగింపు
నయీంకి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు ఈ క్రమంలో ఏ ఒక్క అంశాన్ని వదిలేయటం లేదు. ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులను, అనుచరులను వరుసపెట్టి విచారణ చేస్తున్నారు. బుధవారం ఉద‌యం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జైలు నుంచి న‌యీమ్‌ భార్య హసీనాబేగం, చెల్లెలు సలీమా బేగంను షాద్ న‌గ‌ర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వీరితో పాటు నయీం బావమరిది అబ్జుల్‌మ‌తిన్‌, మ‌రో మ‌హిళ ఖ‌లీమా బేగంను కూడా పోలీసులు క‌స్టడీలోకి తీసుకొని కీలక విచారణ చేపట్టారు.

 

నయీం వెనక మాజీ మంత్రి ఆయనేనా!

నయీం డైరీలో కీలక పేర్లు... బెడ్ రూంలో ఏముంది? 

నయీమ్ అస్తుల వివరాలతో ఖంగుతిన్న పోలీసులు

కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ నే టార్గెట్ చేశాడా???

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nalgonda  Naeem  Tax  Dairy  

Other Articles