అతి అభిమానం మంచిది కాదని పవన్ హితవు | pawan meets vinod royal family

Pawan meets vinod royal family

pawan meets vinod royal family, pawan meets vinod royal family, pawan with media at vinod royal house, pawan visits Vinod Royal family, pawan request to fans

pawan meets vinod royal family says request Fans dont act much such kind of incidents.

ITEMVIDEOS:మితిమీరిన అభిమానం మంచిది కాదు-పవన్

Posted: 08/25/2016 11:51 AM IST
Pawan meets vinod royal family

తనపై అభిమానంతో ప్రాణాలు కోల్పోయిన వినోద్ రాయల్ కుటుంబ సభ్యులును టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓదార్చాడు. భారీగా అభిమానుల, జనసేన కార్యకర్తల సమక్షంలో కాసేపటి క్రితం వినోద్ ఇంటికి చేరుకున్నాడు పవన్. పవన్ ని చూడగానే రోదించిన వినోద్ తల్లి తన గుండెకోతను వెల్లగక్కింది. వినోద్ కుటుంబ సభ్యుల ఆవేదను చూసి పవన్ కళ్లు చెమ్మగిల్లాయి. వినోద్ సోదరి పవన్ గుండెల పడి రోదించింది. ఘటన జరిగిన తీరును పవన్ స్వయంగా అడిగి తెలుసుకున్నాడు.

pawan console vinod royal family

అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ... వినోద్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. మరో రెండు నెలలో అమెరికా వెళ్లాల్సిన యువకుడి జీవితం ఇలా అర్థాంతరంగా ముగియటం భాధాకరమని ప్రకటించాడు. మితిమీరిన అభిమానం మంచిది కాదని ఈ సందర్భంగా అభిమానులకు సూచించాడు. హీరోల మధ్య సినిమాలకు సంబంధించి పోటీ ఉంటుంది. కానీ, గొడవలు ఉండవు. మేమందరం కలిసే ఉంటాం. కిందిస్థాయిలో అది ఉండటం లేదు. అభిమానం ఉండాలి. కానీ, చంపుకునే స్థాయిలో కక్షలు పెంచుకోవద్దు. వినోద్ హత్య కర్ణాటకలోని కోలార్ లో జరిగినందున విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత కన్నడ ప్రభుత్వానిదే. వారు విఫలమయ్యారని భావిస్తే, సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపాడు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే . ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదని కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నాడు.

 

అంతకు ముందు పవన్ వినోద్ తల్లిని ఓదార్చాడు. అవయవదాన కార్యక్రమం కోసం కోలార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తన కొడుకును అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆమె వివరించింది. కార్యక్రమం చివర్లో జై పవన్ అని నినాదాలు చేయగా, అక్కడే ఉన్న మరో హీరో అభిమాని అక్షయ్ అభ్యంతరం చెప్పటంతో వివాదం చెలరేగిందని, ఆపై అంతా సర్దిచెప్పటంతో అక్కడితో సమసిపోయిందని అంతా అనుకున్నారు. అయితే హోటల్ దగ్గర మరోసారి వీరిద్దరు గొడవకు దిగటం, ఆపై అక్షయ్ కత్తితో దాడికి దిగటంతో వినోద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Vinod royal family  request  fans  

Other Articles