భార్య శవంతో పది కిలోమీటర్లు నడక | man carries wife’s body on shoulders in Odisha

Man carries wife s body on shoulders in odisha

Denied a mortuary van, Odisha man carries wife’s body on shoulders, Odisha man carries wife’s body, husband with wife body in India

Denied a mortuary van, man carries wife’s body on shoulders in Odisha

ఎలాంటి సొసైటీలో బతుకుతున్నామో చెప్పే ఫోటో ఇది

Posted: 08/25/2016 01:23 PM IST
Man carries wife s body on shoulders in odisha

అవును... ఈ ఫోటో చూస్తే మనం ఇంత దారుణమైన సమాజంలో మనం బతుకుతున్నామా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరి మదిలో పుడుతుంది. కటిక పేద కుటుంబం. భార్య అనారోగ్యంతో చనిపోయింది. శవాన్ని తరలించేందుకు అధికారులు మార్చురీ వ్యాన్ ను అధికారులు నిరాకరించారు. అయినా ఆ భర్త ధైర్యంతో ముందుకు కదిలాడు. జేబులో డబ్బుల్లేక పోవటంతో భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకున్నాడు. పక్కనే కూతురు ఉంది. అలా ఏకధాటిగా 10 కిలోమీటర్లు అలా ప్రయాణించాడు. ఒడిషాలో జరిగిన ఈ ఘటన లోతులోకి వెళ్లితే...

మేఘారా అనే గిరిజన గ్రామానికి చెందిన దనమాజి భార్య అమాంగ్ దేయి కొంతకాలంగా క్షయతో బాధపడుతోంది. వ్యాధి ముదరడంతో, ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి ఆమె మరణించింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు వాహనం సమకూర్చాల్సిందిగా ఆసుపత్రి అధికారులను వేడుకున్నాడు. అయితే అందుకు వారు సహకరించలేదు. దీంతో ఆమెను బట్టల్లో చుట్టి, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గ్రామానికి కాలినడకన బయలుదేరాడు.

చుట్టుపక్కల గ్రామాల స్థానికులు చూస్తేనే ఉన్నారు. వారికి విషయమూ అర్థమైంది. కానీ, సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎలాగోలా విషయం తెలుసుకున్న మీడియా, వెంటనే ఆ వార్తను ప్రత్యక్ష ప్రసారం చేసింది. దాదాపు 10 కిలోమీటర్లు నడిచిన తరువాత, కలెక్టరుకు దృష్టికి విషయం చేరింది. వెంటనే ఆయన వాహనాన్ని ఏర్పాటు చేయించారు. అంతేకాదు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. నిజానికి ఒడిశాలో మృతదేహాలను వారి ప్రాంతాలకు ఉచితంగా చేర్చేందుకు 'మహాపారాయణ' అనే పథకం అమలవుతోంది. కానీ, లంచాల కోసం అధికారులు ఇలా వ్యవహరించడం ఒకటయితే, సాటి మనిషికి సాయగుణం చేయాలన్న బుద్ధి ఏ ఒక్కరిలో కలగకపోవటం సిగ్గుచేటు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Odisha  husband  wife’s body  shoulders  by walk  10 KM  

Other Articles