రాష్ట్ర బంద్ కు విపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు More bodies support tomorrow's bandh

Dmk other oppn parties extend support to tn bandh

dmk suports bandh, more bodies support bandh, cauvery bandh, cauvery dispute, tamil nadu, tamil nadu bandh, tamil nadu news, tamil nadu news, latest news, dmk news, national news, india news

Opposition parties, including DMK, extended their support to the September 16 Tamil Nadu bandh called by various traders and farmers bodies in the state over the Cauvery water sharing row

రాష్ట్ర బంద్ కు విపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు

Posted: 09/15/2016 10:31 AM IST
Dmk other oppn parties extend support to tn bandh

కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని తమిళులపై దాడులకు తెగబడటం.. దానిని ప్రతికారంగా చెన్నైలో కన్నడీగులపై ప్రతిదాడులు జరగడం.. దీంతో ఈ వ్యవహరం మరింత జఠిలంగా మారడంతో.. తమ హక్కుల పరిరక్షణకు కర్ణాటక ప్రభుత్వాన్ని నిరసిస్తూ, తమిళులపై దాడులను ఖండిస్తూ ఈనెల 15వ తేదీన బంద్ పాటించాలని తమిళనాడు వ్యవసాయ సంయుక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షులు ధనపాలన్ మంగళవారం ప్రకటించారు. ఈ బంద్ కు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మద్దతునిచ్చింది. ఈ మేరకు అ పార్టీ అధినేత కరుణానిధిని కలసిన రైతు సంఘాలకు ఆయన మద్దుతు ప్రకటించారు.
 
కరుణానిధితో పాటు పలు పార్టీలు కూడా స్వచ్చందంగా శుక్రవారం జరిగే బంద్ లో తాము పాల్గోననున్నట్లు తెలిపాయి, ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. రేపటి బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. తమ రాష్ట్రవాసులతో పాటు తమ రాష్ట్రానికి చెందిన అస్తులను కూడా కాపాడే పనిలో భాగంగా తాము బంద్ పిలుపునిచ్చినట్లు ధనపాలన్ ఇప్పటికే ప్రకటించారు. తాగునీటికి కటకటలాడుతున్న తమను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దయతలచి తమ తీర్పుతో న్యాయం చేయాలని భావిస్తే.. ధానిని కూడా అడ్డుకోవడం సహేతుకం కాదని అయన అన్నారు.

బెంగళూరులో తమిళనాడు బస్సులను దహనం చేసినందుకు ప్రతీకారంగా రాష్ట్రంలో పలు ఆందోళనలు సాగాయి. కర్ణాటక వాహనదారులు తమిళనాడు నంబరు ప్లేట్లను తగిలించుకుని తిరుగుతున్నారు. కర్ణాటక బ్యాంకులు, కార్యాలయాలకు బందోబస్తు చేసినా అనేక చోట్ల ఆందోళనకారులు రెచ్చిపోయారు. చెన్నైలో 171 కర్ణాటక కార్యాలయాలకు 68 హోటళ్లకు, 66 ఎంటీఎంలకు పోలీసు బందోబస్తు పెట్టారు. కోయంబత్తూరు జిల్లా గాంధీపురం నుంచి గరుడాలయా సంస్థకు చెందిన ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ బస్సు 21 మంది ప్రయాణికులతో చెన్నైకి బయలుదేరగా, దానిని ఇద్దరు దుండగులు అడ్డగించి రాళ్ల దాడికి పాల్పడ్డారు.
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : state bandh tomorrow  Cauvery water dispute  dmk  polictical parties  Tamilnadu bandh  

Other Articles