బాలయ్యపై కేసు కోసం జీవో జారీ చేశారు | AP govt stop prosecution in Balayya case

Ap govt stop prosecution in balayya case

Balayya case, AP govt released GO 122 for Balayya, GO 122 for Balayya, Balayya case Prosecution, Election Code Violation Case on Balayya

AP govt stop prosecution in Balayya case, released GO 122.

బాలయ్యపై కేసు కోసం జీవో జారీ చేశారు

Posted: 09/15/2016 11:00 AM IST
Ap govt stop prosecution in balayya case

ఏపీ సర్కార్ టాలీవుడ్ హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పెద్ద ఊరటనిచ్చింది. ఏడేళ్ల క్రితం ఆయనపై నమోదైన ఓ కేసులో విచారణను నిలిపేయాలని ప్రభుత్వం ఏకంగా జీవో జారీ చేసింది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరసరావుపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కోడెల శివప్రసాద్ నిలబడగా, ఆయన తరఫున ప్రచారం చేసేందుకు బాలకృష్ణ హాజరయ్యారు. ఆ సమయంలో పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా, నిబంధనలను అతిక్రమించి మరీ ఆయన సభ, ర్యాలీ నిర్వహించారు.

దీంతో బాలకృష్ణతో పాటు కోడెల, ఆయన కుమారుడు శివరామకృష్ణ, గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, తదితర 15 మందిపై కేసు నమోదైంది. ఏడేళ్లుగా ఈ కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఈ కేసుపై చొరవ తీసుకున్న ఏపీ సీఎం, బాలయ్య వియ్యంకుడు చంద్రబాబు దానిని లైట్ తీస్కోవాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించారు. దీంతో ఈ కేసులో ప్రాసిక్యూషన్ ను నిలిపివేయాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలు ఇవ్వడంతో, ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ జీవో నంబరు 122ను విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Balakrishna  2009 Election Case  AP govt  GO 122  Prosecution  

Other Articles