ఎంసెట్ 3 ఫలితాలు విడుదల | telangana Eamcet 3 results declared

Telangana eamcet 3 results declared

Telangana Eamcet 3 results, Eamcet 3 results declared, AP girl topper in EAMCET 3, 8 marks for all eamcet 3 students, eamcet 3 results, prof.Papi Reddy Eamcet-3 results

Telangana Eamcet 3 results declared. AP girl Manasa got top rank.

టీఎస్ ఎంసెట్-3 ఫలితాలు విడుదల

Posted: 09/15/2016 12:45 PM IST
Telangana eamcet 3 results declared

తెలంగాణ ఎంసెట్-3 ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు గురువారం మధ్యాహ్నం జేఎన్‌టీయూలో విడుదల చేశారు. ప్రశ్నా పత్రంలో సిలబస్ లో లేని ఓ ప్రశ్నతోపాటు మొత్తం 8 క్వశ్చన్స్ తప్పుగా వచ్చాయి. దీంతో అందరికీ 8 మార్కులు కలుపుతున్నట్లు ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

ఫస్ట ర్యాంక్ కృష్ణా జిల్లా గుడివాడ చెందిన రేగళ్ల మానస (152), రెండో ర్యాంక్ సికింద్రాబాద్ కు చెందిన హారిక(151), మూడో ర్యాంక్ అనంతపురంకు చెందిన తేజస్విని(151) కైవసం చేసుకున్నారు. ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీక్‌ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దుచేసి సెప్టెంబరు 11న ఎంసెట్‌-3 నిర్వహించిన విషయం తెలిసిందే! ఈ పరీక్షకు 56,153 మంది విద్యార్థులకు గానూ 37,199 మంది హాజరయ్యారు. ఈ ప్రశ్నపత్రంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి బుధవారం సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఫలితాల కోసం http://www.tseamcet.in/ వెబ్ సైట్ ను సంప్రదించాల్సిందిగా కన్వీనర్ యాదయ్య సూచించారు.

మరోవైపు ఎంసెట్‌-1 ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలు పొంది.. ఎంసెట్‌-3 కౌన్సెలింగ్‌కు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఇవ్వాలని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈమేరకు మండలి కార్యదర్శి శ్రీనివాసరావు వర్సిటీలకు లేఖ రాశారు. ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీక్‌ అయిన నేపథ్యంలో విద్యా సంవత్సరం వృథా అవుతుందేమోన న్న ఆందోళనతో చాలామంది విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మడీ, అగ్రికల్చర్‌, వెటర్నరీతోపాటు ఇతర కోర్సు ల్లో చేరారు. అయితే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఎంసెట్‌-3కి కూడా వారు హాజరయ్యారు. ఉత్తమ ర్యాంకు సాధించే అవకాశం ఉన్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వీరికి ఆయా కాలేజీలు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందు కు ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Eamcet-3  results  declared  

Other Articles