ప్రేమోన్మాదం ఎంతటి దారుణాలకు ఉలిగొల్పుతుందో స్వాతి ఉదంతం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. కొబ్బరిబోండాలు నరికే కత్తితో కర్కశంగా కడతేర్చాడు రామ్ కుమార్. ఇదిలా ఉండగానే తమిళనాడులో అలాంటి మరో దారుణం. ప్రేమించలేదు... పైగా పదిరోజుల్లో పెళ్లికి సిద్ధమైందన్న అక్కసుతో ఓ యువతిని ఇంట్లో దూరి కర్కశంగా నరికి చంపాడు.
కొయంబత్తూర్ లోని అన్నూర్ లో నివసిస్తున్న ధన్య (23) ఇటీవలె ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేయిట్ కంపెనీలో ఉద్యోగానికి చేరింది. తండ్రి ఓ టైలర్. ఇక జహీర్(27) అనే వ్యక్తి కేరళ లోని పాలక్కడ్ నుంచి వలస వచ్చి ధన్య నివసిస్తున్న వీధిలోనే ఉంటు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇక గత కొంతకాలంగా తనను ప్రేమించాలని ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయమై ఆమె పేరేంట్స్ అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ధన్యకి కొద్దిరోజుల క్రితం ఎంగేజ్ మెంట్ అయ్యింది. మరో పది రోజుల్లో వివాహం కూడా. విషయం తెలుసుకున్న జహీర్ కోపంతో బుధవారం రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా, దాడి చేశాడు.
తనను ప్రేమించడం లేదన్ని అరుస్తూ కిరాతకంగా కత్తితో దాడిచేసి ఆమెను హతమార్చాడు ఆ దుర్మార్గుడు. ఆపై అక్కడి నుంచి పరారై సొంతూరికి చేరుకున్నాడు. పొరుగురూ వెళ్లోచ్చిన ధన్య తల్లిదండ్రులు ఈ ఘోరంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేశామని, వెనుకవైపు మార్గం నుంచి ఇంట్లోకి చొరబడి దుండగుడు ఈ కిరాతకానికి పాల్పడి ఉంటాడని వారు తెలిపారు. ధన్య శరీరం నిండా కత్తి గాట్లు, పోట్లు ఉన్నాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో సంఘటన స్థలంలోనే ఆమె ప్రాణాలు విడిచిందని నిర్ధారణ అయ్యింది.
కాగా, తల్లిదండ్రుల ద్వారా వేధింపుల ప్రియుడి గురించి తెలుసుకున్న పోలీసులు జహీర్ కోసం అతని స్వగ్రామంకి వెళ్లారు. కానీ, ఆలోపే నిందితుడు విషయం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు అన్నూర్లో గురువారం బంద్ నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more