ఖైరతాబాద్ మహాగణపతి కోసం సాంప్రదాయాన్ని బ్రేక్ చేశారు | Khairatabad Ganesh breaks from tradition immersion completed early

Khairatabad ganesh breaks from tradition immersion completed early

Khairatabad Ganesh breaks from tradition, Khairatabad Ganesh immersion 2016, Khairatabad Ganesh immersion, Khairatabad Ganesh Nimajjanam, Khairatabad Ganesh Nimajjanam 2016

Khairatabad Ganesh breaks from tradition immersion completed early in 2016.

ITEMVIDEOS:నిర్విర్ఘ్నంగా మహాగణపతి నిమజ్జనం

Posted: 09/15/2016 02:33 PM IST
Khairatabad ganesh breaks from tradition immersion completed early

చరిత్రలో తొలిసారి మహగణపతి నిమజ్జనం త్వరగా ముగిసింది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఫలించాయి. ఖైరతాబాద్ లో ఈసారి కొలువుదీరిన 58 అడుగుల ఎత్తులో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్ల మధ్య మధ్యాహ్నానికే పూర్తయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఈ విఘ్నేశ్వరుడికి ఉదయమే కలశపూజ పూర్తి చేసి విగ్రహాన్ని వాహనంపైకి చేర్చారు. ప్రధాన విగ్రహంతో పాటు బాలాజీ, గోవర్థనగిరిదారి ఘట్టాలు ముందుకు సాగాయి.

Khairatabad 2016 ganesha

Khairatabad Ganesh Immersion

బుధ‌వారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షం వ‌ల్ల శోభాయాత్ర ఆల‌స్య‌మ‌వుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఉదయం 9 ప్రాంతంలో ఏర్పాట్లు ప్రారంభంకాగా, మీరాటాకీస్‌, ల‌క్డీకాపూల్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ట్యాంక్‌బండ్ చేరుకుంది. మహాగ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా తరలివ‌చ్చారు. మ‌రోవైపు అదేసమయంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి కూడా గ‌ణ‌నాథులు ట్యాంక్‌బండ్ దిశ‌గా బ‌య‌లుదేరడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు తిరుపతి బాలాజీ, గోవర్థన గిరిధారి రూపంలోని కృష్ణుని ప్రతిమలు సాగగా, శోభాయాత్రకు సారథ్యం వహించేందుకు ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి ముందు నిలిచాడు.

మీరా(సెన్సేషన్) టాకీస్‌, లక్డీకాపూల్‌ మీదుగా శోభాయాత్ర ఎన్టీఆర్‌ మార్గ్‌ ఆపై టాంక్ బండ్ చేరుకున్న బొజ్జగణపయ్య కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం సైతం లెక్కచేయకుండా మహాగణపతి శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జైజై గణేశా.. బై బై గణేశా అంటూ నినాదాలతో టాక్ బండ్ మారుమోగిపోయింది. వైభవంగా ముగిసిన శోభాయాత్ర అనంతరం దాదాపు 40 టన్నుల బరువున్న మహాగణపతి నిమజ్జనం కోసం జర్మనీలో తయారైన భారీ క్రేజ్ ను ఇందుకు ఉపయోగించారు. బై బై గణేషా నినాదాల నడుమ ఎట్టకేలకు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం పూర్తయిపోయింది.

 

ఇక ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిమజ్జనం ఎంతో ఆలస్యంగా సాగడాన్ని ప్రతియేటా తిలకిస్తుండే ప్రజలు, ఇంత వేగంగా కదలటం, నిమజ్జనం పూర్తి కావటం ఆశ్చర్యంగా తిలకించారు. గరంలో గణేష్‌ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో సజావుగా సాగటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సాయంత్రంలోగా గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. దాదాపు గురువారం 30వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశముంది. హుస్సేన్‌ సాగర్‌ సహా నగరంలో పదిచోట్ల నిమజ్జనోత్సవాలు జరగుతున్నాయి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khairatabad  Lord Ganesh  immersion  2016  

Other Articles