గత రెండు రోజులుగా ఓ పెళ్లి వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. 68 ఏళ్ల ఓ ఫ్లోరిడా ముసలోడు ఓ 24 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోవటం ఒక ఎత్తు అయితే... ఆ అమ్మాయి ఏకంగా అతగాడి మనవరాలు అని తేలిందని ఆ వార్త సారాంశం. అంతర్జాతీయ ఆన్ లైన్ మాగ్జైన్స్ ఈ వార్తను ప్రచురించడంతో స్థానిక మీడియాలు కూడా ఎగబడి పోయి ఆ వార్తను ప్రచురింపజేశాయి.
ఇంతకీ ఆ వార్త ఏంటంటే... అప్పటికే రెండు పెళ్లి చేసుకుని పెళ్లాలను వదిలేసిన ఓ వృద్ధుడు(68) ఆన్ లైన్ లో పెళ్లి ప్రకటన ఇచ్చుకున్నాడు. అది చూసిన ఓ 24 ఏళ్ల యువతి(పచ్చితిరుగుబోతు కావటంతో ఇంట్లోంచి గెంటేశారంట) డబ్బు కోసం ఈ పెళ్లికి సిద్ధమైందట. పెళ్లాయ్యక ఇంట్లోని ఫోటో ఆల్బమ్స్ చూస్తుండగా, మొదటి భార్య పిల్లలో తన తండ్రి ఉండటం చూసిన యువతి షాక్ తిని తనకు రక్తం పంచిన తాతే తన భర్త అని తెలుసుకుని షాక్ తిందని’ కథనాలు ప్రచురించాయి.
అంతేకాదు పాశ్చాత్య దేశాల్లో వారి సంస్కృతే వేరు. వివాహ సమయంలో వారికేలాంటి పట్టింపులు ఉండవు. వయస్సు ఎక్కువ తక్కువలతో సంబంధమే లేదంటూ ఆ కథనాన్ని ఉటంకించాయి. యువతులు నడివయస్కులను, వృద్ధులను పెళ్లి చేసుకోవడం సాధారణమే అయిపోయింది అంటూ స్టోరీలు రాసేశాయి. తీరా ఇప్పుడు తేలిన అసలు విషయం ఏంటంటే... అది అంతా ఫేక్ వార్త అని...
ఫ్లోరిడా సన్ పోస్ట్ లో ఈ వార్త ప్రచురితం కాగా, అది పట్టుకుని మిగతా మీడియా ఛానెల్ కూడా నిజం అనుకుని వార్తను అచ్చుగుద్దినట్లు ప్రచురించేశాయి. నిజానికి ఈ వార్త ప్రచురితమైన ఫ్లోరిడాసన్ పోస్ట్.కామ్ ప్రారంభమైన మూడు రోజులే అవుతోంది. వీక్షకులను ఆకట్టుకునేందుకు ఇలాంటి ఫేక్ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తూ ఓ ట్వీట్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఇక ఇందులో నిజానిజాలను బేరీజు వేసుకుని మన తెలుగు మీడియాలు కూడా తాత-మనవరాళ్ల పెళ్లిపై ప్రాసలతో కథనాలు వేస్తూనే ఉన్నాయి.
Hi @ComplexMag, the site you pulled this from was only created 3 days ago and the story is probably fake. Congrats on being gullible pic.twitter.com/A7Tmcs0d89
— Florida Man (@_FloridaMan) October 3, 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more