షవర్ లో సీసీ కెమెరా దాచిన ఓనర్... అమ్మాయిల నగ్న వీడియోలు వైరల్ | Sydney man planted camera in bathroom to film women showering

Sydney man planted camera in bathroom to film women showering

Sydney real estate agent Stephen Yao, Man planted camera in bathroom to film women showering, Man planted camera in bathroom for girls, Owner eyed on Tenant girls, Owner filming girls video

Sydney real estate agent Stephen Yao planted camera in bathroom to film women showering

అమ్మాయిల నగ్న వీడియోలు తీశానని ఒప్పేసుకున్నాడు

Posted: 10/07/2016 10:26 AM IST
Sydney man planted camera in bathroom to film women showering

సీసీ కెమెరాలతో అమ్మాయిల నగ్న వీడియోలు తీసిన ఓ ప్రబుద్ధుడు, ఆ తప్పును నవ్వుతూ ఒప్పేసుకుని శిక్షకు సిద్ధమయ్యాడు. బాత్ రూంలో అమ్మాయిల నగ్న వీడియోలు తీసి వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడాలన్న ఆలోచన చేశాడు ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఘటన వివరాలోకి వెళ్లితే...

కింగ్స్ ఫోర్డ్ ప్రాంతంలో ఒక అపార్ట్ మెంట్ యజమాని అయిన స్టీఫెన్ యావో(47) ఓ ఫ్లాట్ లో రెంట్ కి ఉంటున్న ఇద్దరు యువతుల(22, 23) పై నిఘా పెట్టాడు. బాత్ రూంలో సీసీ కెమెరాలు ఉంచి వారు స్నానం చేస్తుండగా వీడియోలను చిత్రీకరించాడు. ఓ రోజు స్నానం చేస్తున్న యువతికి షవర్ లో ఓ వస్తువు కనిపించింది. కంగారు పడి తోటి రూమ్ మేట్ కి చెప్పగా, అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించింది. వారోచ్చి అది సీసీ కెమెరాగా తేల్చేశారు. తమ అనుమతి లేకుండా నగ్న వీడియోలను చిత్రీకరించాడంటూ యావో పై కేసు నమోదు చేశారు. .

దీంతో వ్యవహారం వెవర్లీ న్యాయస్థానం కి చేరింది. కోర్టుకి హాజరైన యావోను ఆరోపణల గురించి ప్రశ్నిస్తే నిసిగ్గుగా చిత్రీకరించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. అంతేకాదు జడ్జి ముందు తనను క్షమించాలంటూ ఆ యువతులను వేడుకున్నాడు. నవంబర్ 23న అతగాడి వ్యవహారంపై కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sydney Man  planted camera  Shower Videos  

Other Articles