అమ్మ కోసం అపోలో వెళ్లిన యువరాజు... ఏమైంది? | Rahul Gandhi visits Apollo hospital to enquire about Jaya's health

Rahul gandhi visits apollo hospital to enquire about jaya s health

Rahul visits Apollo for CM Jayalalitha, Rahul inquiry about Jayalaitha's health, Rahul Gandhi at Apollo hospital, Rahul Gandhi visits Apollo hospital, Rahul Gandhi enquire about Jaya's health

Rahul Gandhi visits Apollo hospital to enquire about Jaya's health.

జయలలితను పరామర్శించిన రాహుల్

Posted: 10/07/2016 12:37 PM IST
Rahul gandhi visits apollo hospital to enquire about jaya s health

తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కదిలాడు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లిన రాహుల్, అనంతరం అపోలో ఆస్పత్రికి వెళ్లాడు.

రెండు వారాలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నప్పటికీ, ఆమెకు ఏమైందన్న విషయంలో సరైన సమాచారం ఇంతవరకూ బయటకు రాని సంగతి తెలిసిందే. మేనకోడలు, దత్త పుత్రుడికి కూడా జయలలితను చూసేందుకు అనుమతి లభించక పోగా, మరి ఇప్పుడు రాహుల్ కి అసలు అనుమతి లభిస్తుందా చెప్పండి? ఆఖరికి అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వయంగా రాహుల్ కు స్వాగతం పలికి లోపలికి తీసుకు వెళ్లినా, ఆయన్ను జయలలిత వద్దకు తీసుకువెళ్లేందుకు అధికారులు అంగీకరించలేదు.

ఆమెను చూసేందుకు వీల్లేదని స్పష్టం చేయడంతో, ఆమె ఆరోగ్యం, ఏమైందని మాత్రమే రాహుల్ అడిగి తెలుసుకుని బయటకు వచ్చారు. జయలలిత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు మీడియాకు చెప్పిన రాహుల్ ఆపై వెళ్లిపోయారు. కాగా, ఆమెకు సుదీర్ఘకాలం పాటు చికిత్స అవసరమని, అది ఎన్నాళ్లన్నది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు రాహుల్ కు చెప్పినట్టు తెలుస్తోంది.అయితే ఆస్పత్రిలోకి వెళ్లిన రాహుల్ అన్నాడీఎంకే నేతలతోపాటు, ముఖ్య అనుచరులతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు అపోలో వైద్యులు బులిటెన్ విడుదల చేసినప్పటికీ, ఎయిమ్స్ బృందం రాకతో కొన్ని అనుమానాలు మెదులుతున్నాయి. ఇక బయట వేలాది మంది ఏఐఏడీఎంకే కార్యకర్తలు అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ, పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జయలలిత స్వయంగా శ్వాస పీల్చుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. ఆమెను వెంటిలేటర్ పై ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తూ చికిత్స చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Apollo Hospital  CM Jayalalitha's health  

Other Articles