కామన్ గా ఇండియాకు చెందిన వెబ్ సైట్లను హ్యాక్ చేయటం పాక్ కి ఎప్పటి నుంచో అలవాటు. అంతేందుకు ఇటీవలే సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత భారత్‌ను తిప్పలు పెట్టే యోచనలో గ్రీన్ ట్రిబ్యునల్ సైట్ ను హ్యాక్ చేసి తామేదో గొప్పపని చేశామంటూ తెగ ఫీలయిపోయింది. అంతేకాదు పాక్ మీదుగా వెళ్తున్న విమానాలను హ్యాక్ చేసి తమ దేశభక్తి గేయాలను పోస్టు చేశారు కొందరు. ప్రపంచానికి సాఫ్ట్వేర్లను సప్లై చేస్తోన్న దేశంగా పేరొందిన భారత్ వెబ్సైట్లపైనే పాక్ హ్యాకర్లు దాడి చేస్తే ఊరుకుంటుందా?
అందుకే భారత హ్యాకర్లు వారి హ్యాకింగ్ దాడికి ప్రతిదాడి మొదలుపెట్టి పాకిస్థాన్ ప్రభుత్వ నెట్‌వర్క్‌లోకి సమర్థవంతంగా ప్రవేశించేశారు. ఆ దేశ ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్లు, డేటాలను లాక్ చేస్తున్నారు. ఇటీవలే యూరీలో పాక్ ఉగ్రవాదుల చర్యకు మన సైనికులు దిమ్మతిరిగే సమాధానమివ్వడంతో పాక్ వెన్నులో వణుకుపుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హ్యాకర్లు చేసిన ప్రతిదాడితో మరోసారి దిక్కుతోచని స్థితిలో పడింది పాకిస్థాన్.
భారత హ్యాకర్లు చేసిన ఈ అంతర్జాల దాడిని ఎలా ఎదురించాలో తెలియని అక్కడి సైబర్ నిపుణులు అయోమయంలో పడ్డారు. చివరకు భారత హ్యాకర్లను వేడుకునే స్థితికి వచ్చారు. తమ కంప్యూటర్లను అన్‌లాక్ చేస్తే భారీ మొత్తం ఇస్తామని పేర్కొంటున్నారు. అయితే భారత హ్యాకర్లు వాళ్ల ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. దేశభక్తితోనే ఈ పనిచేసిన భారత హ్యాకర్లు పాక్ ఇచ్చే ఆఫర్లు 'మాకు వద్దే వద్దు' అని అంటుండంతో పాక్ ఇరుకున పడింది.
పాక్ కనబరుస్తోన్న ధోరణి పట్ల భారతీయ హ్యాకర్లకు ఆగ్రహం తెప్పించింది. తమ పనిలో పనిగా ఇండియాపై పాక్ చేస్తోన్న దుష్ప్రచారాన్ని కూడా భారతీయ హ్యాకర్లు తిప్పికొడుతున్నారు. భారత హ్యాకర్ల దెబ్బకి పాక్ ప్రభుత్వ సైట్లేవీ పనిచేయడం లేదు. రాన్సమ్వేర్ను చొప్పించి పాక్ నెట్వర్క్ మొత్తాన్ని స్తంభింపజేశారు. 'తెలంగాణ సైబర్ వారియర్' అనే పేరుతో ఉన్న ఒక హ్యాకర్ ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. దీనిని ఉటంకిస్తూ మెయిల్ వన్ లాంటి అంతర్జాతీయ వెబ్ సైట్లు కూడా కథనాలను ప్రచురించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more