తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో గత 25 రోజులుగా చెన్నైలోని అపోలో అస్పత్రిలో చికిత్స పోందుతున్న నేపథ్యంలో తెరపైకి అమె రాజకీయ వారసుడు ఎవరు అన్న అంశం ఇప్పుడు తమళినాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింద. జ్వరం, డీహైడ్రేషన్, లంగ్స్ ఇన్ఫెక్షన్ కారణంగా చేరిన అమ్మ ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. అయితే గత 25 రోజులుగా చికిత్స జరుగుతున్న అమె పరిస్థితిపై అభిమానుల్లో కలత మాత్రం వీటడం లేదు. ఆమె ఆరోగ్యంపై ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో జయలలిత అరోగ్యంపై అందోళన తీవ్రతరమైంది. ఎయిమ్స్ వైద్యులు, లండన్ డాక్టర్ గత పక్షం రోజులుగా చికిత్స చేస్తున్నా.. వైద్యులు అమె కోలుకుంటుంది, చికిత్సకు స్పందిస్తుంది అని మాత్రమే బులెటన్ లో ప్రకటిస్తున్నారు. తప్ప.. నిజంగా అమె ఎంతమేరకు కోలుకుందన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయకపోవడంతో అందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో అమ్మ రాజకీయ వారసులపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అనేక అటుపోట్లను తిని కూడా రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీని ప్రజల్లో బలమైన పార్టీగా.. ఉనికిని చాటుకునేలా చేసేందుకు అహర్నిశలు కష్టపడి పురచ్చి తలైవిగా ఎదిగారు.
అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్ చనిపోయాక 1989లో ఆ పార్టీ పగ్గాలు జయలలిత చేపట్టిన నాటి నుంచి ఈనాటి వరకు పార్టీలో జయలలిత ఎదురులేని నాయకురాలిగా ఏకఛత్రాధిపత్యంతో పార్టీని సమర్థవంతంగా నడిపారు. సుమారుగా మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒరవడిని తిరగరాసి తన పార్టీని రెండో పర్యాయం కూడా అధికారంలోకి తీసుకువచ్చారు. రాజకీయంలో కొమ్ములుదిరిగిన దిగ్గజాలైన ప్రతిపక్ష నేతలను కాదని ప్రజల తనను, తన పార్టీని చేరువయ్యేలా చేసింద అమ్మ. దీంతో తమిళనాట ప్రజలో అమ్మకు అదరణ అధకంగానే వుంది.
అనారోగ్యం కారణంగా జయలిలిత కొలుకున్న తరువాత కూడా మరో రెండు నెలలు అమె అస్పత్రిలోనే వుండాలని ఇప్పటికే వైద్యలు చెబుతున్నారు. కాగా అస్పత్రి నుంచి అమె డిశ్చార్జ్ అయినా.. మరో మూడు నాలుగు నెలలు అమె విశ్రాంతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుందని వైద్య వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో అమ్మ వారుసులు తానేనంటూ అమె మేనకొడలు తెరపైకి వచ్చారు. జయలలితకు తానే అసలు సిసలైన వారసురాలినంటూ ఆమె అన్న కూతురు దీప కుమార్ తెరపైకి వచ్చారు.
జయలలిత సోదరుడు జయకుమార్.. విజయలక్ష్మి దంపతుల తనయ దీపాకుమార్. అప్పట్టలో జయతో పాటే సోదరుడి కుటుంబం కూడా వుండేది. ఆ తర్వాత వారిమధ్య మనస్పర్థలు రావడంతో అమె సోదరుడు విడిపోయాడు. దీంతో, ఆయన పోయస్ గార్డెన్‌ను వదిలి టీనగర్‌లో సెటిల్ అయ్యారు. 1995లో జయకుమార్ చనిపోవడంతో అమె స్వయంగా వెళ్లి పరామర్శించారు. 2013లో వదిన విజయలక్ష్మి మరణించిన సమయంలో కానీ, దీపా వివాహానికి కానీ జయలలిత హాజరుకాలేదు. భర్తతో విభేదాలు వచ్చి దూరంగా వుంటున్న సమయంలో దీపా కుమార్ జయలలితకు దెగ్గర కావాలని ప్రయత్నించి విఫలమయ్యారు.
ఈ నేపథ్యంలో అమ్మ తన రాజకీయ వారసుడి పేరును వ్యక్తం చేశారని, తన వారసుడిగా హీరో అజిత్ పేరును తన వీలునామాలో కూడా పోందుపర్చారని వార్తలు తెరపైకి వచ్చాయి. సినిమాల్లోనూ, వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ వున్న అజిత్‌నే అమ్మ వారసులుగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని.. ఇందులో భాగంగా చర్చలు కూడా జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యూత్ ఫాలోయింగ్ ఉన్న అజిత్‌ను అన్నాడీఎంకే పార్టీ నాయకుడిగా నియమించాలని యోచిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో అమ్మ నమ్మినబంటు, పలు సందర్భాలలో నమ్మినబంటుగా వున్న అర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు ముఖ్యమంత్రిగా జయలలిత నిర్వహించే శాఖల బాద్యతలను బదలాయించారు.
అయితే హీరో అజిత్ కుమార్ అన్నాడీఎంకే పార్టీకి రాజకీయ వారసుడిగా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదా..? అందుకనే పన్నీర్ సెల్వంకు అమ్మ శాఖలను బదలాయించారా.? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇ:దుకు అక్రమాస్థుల కేసు అవరోధంగా మారిందా..? అందుకనే హీరో అజిత్ వెనుకంజ వేస్తున్నారా..? అన్న ప్రశ్నలు కూడా చెన్నై పట్టణంలో షికారు చేస్తున్నాయి. కేసుల కొట్టివేసిన తర్వాత పార్టీ క్లీన్ చిట్ అయ్యాకే అన్నాడీఎంకేలో తాను పాలుపంచుకుంటానని అజిత్ చెప్పేసినట్లు సమాచారం. ఇప్పటికే గుడ్ హీరోగా పేరు సంపాదించిన అజిత్.. పార్టీలోని అవినీతిని ఏరేస్తేనే ఆ పార్టీలోకి వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more